News March 22, 2024

భూత్పూర్: అనుమానాస్పదంగా మహిళ మృతి

image

MBNR ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ అనుమానాస్పదంగా మృతిచెందింది. SI విజయ్ భాస్కర్ వివరాలు.. భూత్పూర్ మండలం కొత్తపల్లికి చెందిన చెన్నయ్య నాగమ్మను కడియాలు ఇవ్వాలని తల్లి రాజమ్మ పట్టుబట్టింది. మనస్తాపంతో నాగమ్మ ఈనెల 14న పురుగు మందు తాగగా భర్త చెన్నయ్య జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈనెల 20న అత్తను ఆస్పత్రిలో ఉంచి ఇంటికి వెళ్లిన భర్తకు నీ భార్య చనిపోయిందని రాత్రి ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది.

Similar News

News January 15, 2025

GET READY.. 18న నవోదయ ప్రవేశ పరీక్ష

image

నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు NVS ఈనెల 18న ఎంట్రన్స్ టెస్టు నిర్వహిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 27 కేంద్రాలు ఏర్పాటు చేశామని వట్టెం నవోదయ ప్రిన్సిపల్‌ పి.భాస్కర్‌ తెలిపారు. వెబ్‌సైట్‌ www.Navodaya.gov.in నుంచి విద్యార్థులు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. విద్యార్థి పుట్టిన తేదీ లేదా రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు.

News January 15, 2025

NGKL: సీఎంను కలిసిన ఎంపీ మల్లురవి

image

హైదరాబాద్‌లో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మంగళవారం నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి దాహోస్ పర్యటన విజయవంతంగా ముగించుకొని తిరిగి రావాలి కోరుకున్నారు.

News January 14, 2025

మల్లికార్జున స్వామికి కైలాస వాహన సేవ

image

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి శ్రీశైల క్షేత్రంలో మంగళవారం మకర సంక్రాంతి పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్లకు కైలాస వాహన సేవలు ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారులు, భక్తులు, స్థానికులు, తదితరులు, పెద్ద ఎత్తున స్వామివారి బ్రహ్మోత్సవ సేవలో పాల్గొన్నారు.