News February 26, 2025

భూపాలపల్లి: క్వింటాల్‌కు రూ.25 వేలు మద్దతు ధర కల్పించాలి: గండ్ర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మద్దతు ధర లేక రైతులు సతమతమవుతున్నారని, క్వింటాల్‌కు రూ.25 వేల వరకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాలని ఆయన డిమాండ్ చేశారు. మద్దతు ధరలు లేక మొగుళ్లపల్లి మండలంలో రైతు నిన్న ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. న్యాయం చేయాలన్నారు. 

Similar News

News December 15, 2025

యాదాద్రి: నిత్య కైంకర్యాల సమయాల్లో మార్పు

image

యాదగిరిగుట్టలో ధనుర్మాస ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో నిత్య కైంకర్యాల సమయవేళల్లో మార్పు చేశారు. ఉదయం 3:30లకు సుప్రభాతం, 4:00 నుంచి 4:30 వరకు తిరువారాధన, 4:30 నుంచి 5 వరకు తిరుప్పావై సేవా కాలం, 5 గంటల నుంచి 6 గంటల వరకు నివేదన చాత్మర, 6 గంటల నుంచి 7 గంటల వరకు నిజాబీ అభిషేకం, 7 గంటల నుంచి 7:45 వరకు సహస్రనామార్చన, 7:45 తర్వాత ధర్మ దర్శనాలు ప్రారంభమవుతాయి.

News December 15, 2025

చేగుంట శివారులో మృతదేహం గుర్తింపు

image

మెదక్ జిల్లా చేగుంట గ్రామ శివారులోని రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రైల్వే స్టేషన్ పక్కన ఉన్న బాలాజీ వెంచర్‌లో సుమారు 50 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి విచారణ చేపట్టారు. మృతుడు ఎవరు, ఎలా మరణించాడు అనే వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

News December 15, 2025

KMR: మరో మూడు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు

image

కామారెడ్డి జిల్లాలో గత మూడు రోజులుగా చలి తీవ్రత కనిష్ఠానికి నమోదయ్యి, చలి తీవ్రత స్థిరంగా ఉంది. అయితే మరో మూడు రోజుల పాటు జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 9 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యి, చలి తీవ్రత మరింత పెరుగుతుందని అంచనా వేసింది. చలి ప్రభావం పెరగనుండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.