News March 21, 2025
భూపాలపల్లి జిల్లాలో 3,441 మంది విద్యార్థులు హాజరు

భూపాలపల్లి జిల్లాలోని 20 పరీక్షా కేంద్రాల్లో శుక్రవారం ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యం.రాజేందర్ తెలియజేశారు. 3,449 విద్యార్థులకు 3,441 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు వారు తెలిపారు. పరీక్ష కేంద్రాలలో వైద్యం, కరెంటు, రవాణా సౌకర్యాలు తదితర మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
Similar News
News March 22, 2025
జగిత్యాల: హిందీ పరీక్షకు 8 మంది విద్యార్థులు గైర్హాజరు

పదోతరగతి రెండోరోజు హిందీ పేపర్ రెగ్యులర్‌కు 11,849 విద్యార్థులకు 11,841 విద్యార్థులు హాజరయ్యారు. 8 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. రెగ్యూలర్ విద్యార్థుల హాజరుశాతం 99.93% సప్లిమెంటరీ విద్యార్థులు 4 విద్యార్థులకు 3 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరి హాజరుశాతం 75% అని అధికారులు తెలిపారు.
News March 22, 2025
కృష్ణా: 10వ తరగతి ఓరియంటల్ పరీక్షకు 99.82% హాజరు

కృష్ణా జిల్లాలో శనివారం నిర్వహించిన 10వ తరగతి ఓరియంటల్ పరీక్షకు 99.82% మంది విద్యార్థులు హాజరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు తెలిపారు. 5,581 మంది విద్యార్థులకు గాను 5,571 మంది హాజరయ్యారని, 10 మంది గైర్హాజరైనట్టు డీఈఓ తెలిపారు. పలు పరీక్షా కేంద్రాలను స్క్వాడ్ టీములు పరిశీలించగా ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు.
News March 22, 2025
విశాఖ: కారుణ్య నియామక పత్రాలు అందించిన కలెక్టర్

ఏపీఎస్ ఆర్టీసీలో పని చేస్తూ చనిపోయిన ఏడుగురు కుటుంబ సభ్యులకు శనివారం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. కలెక్టర్ కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు వివిధ ప్రభుత్వ శాఖలలో కారుణ్య నియామక పత్రాలు అందించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పని చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విశాఖ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు ఉన్నారు.