News May 9, 2024
భూపాలపల్లి: తండ్రి బీట్ ఆఫీసర్.. కుమారుడు IFS
యూపీఎస్సీ బుధవారం ప్రకటించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో భూపాలపల్లి మండలం గుర్రంపేట గ్రామానికి చెందిన పోరిక లవ కుమార్ విజయ కేతనం ఎగరవేశారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన లవ కుమార్ 2017 నుంచి సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో నిన్న విడుదల చేసిన ఫలితాల్లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ఎంపికయ్యాడు. లవ కుమార్ తండ్రి సూరి దాస్ సైతం అటవీ శాఖలో బీట్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు.
Similar News
News January 19, 2025
UPDATE: ఆరెపల్లి వద్ద యాక్సిడెంట్.. ఇద్దరు మృతి
WGL ములుగు రోడ్డు సమీపంలోని ఆరెపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శనివారం <<15190249>>ఓ మహిళ మృతి <<>>చెందిన విషయం తెలిసిందే. కాగా ఇదే ప్రమాదంలో గాయపడిన మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కరీమాబాద్‌కు చెందిన కనకలక్ష్మి, సాంబలక్ష్మి చీపురు కట్టల వ్యాపారం చేసేవారు. పస్రా నుంచి చీపురు కట్టలు కొనుగోలు చేసి ఆటోలో వస్తుండగా RTC అద్దె బస్సు ఢీకొని మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News January 19, 2025
స్మార్ట్ సిటీ పనులు గడువు లోగా పూర్తి చేయండి: కమిషనర్
గ్రేటర్ వరంగల్ పరిధిలో స్మార్ట్ సిటీ పథకం కింద కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ ఎండీ, GWMC కమిషనర్ అశ్వినీ తానాజీ వాఖడే అధికారులను ఆదేశించారు. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఇంజినీరింగ్, స్మార్ట్ సిటీ అధికారులతో స్మార్ట్ సిటీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.
News January 18, 2025
సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న ఎస్పీ
మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను ములుగు ఎస్పీ శబరిష్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎండోమెంట్ అధికారులు, ఆలయ పూజారుల సంఘం ఆధ్వర్యంలో ఆలయ సంప్రదాయ ప్రకారం డోలు వాయిద్యాలతో ఎస్పీ శబరీష్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం సమ్మక్క సారలమ్మలకు, పగిడిద్ద రాజు, గోవిందరాజులకు ఎస్పీ మొక్కులు చెల్లించారు.