News April 4, 2025
భూపాలపల్లి: యువతపై కన్నేసి ఉంచాలి!

భూపాలపల్లి జిల్లాలో విద్యార్థులు, యువతపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు, మేధావులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ముగియడంతో పిల్లల కదలికలు, అలవాట్లు, మొబైల్ వాడకంపై నిఘా పెట్టాలంటున్నారు. జిల్లాలో ఇప్పటికే గంజాయి, బోనోఫిక్స్, మద్యం వంటి మత్తు పదార్థాలకు యువత అలవాటు పడుతున్నారని, వ్యసనంగా మారి అనర్థాలకు దారి తీయకముందే అదుపు చేయాలని కోరుతున్నారు.
Similar News
News April 5, 2025
NTR లుక్‌పై అభిమానుల ఆందోళన!

యంగ్ టైగర్ NTR కొత్త లుక్‌పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ‘NTR-NEEL’ సినిమా కోసం ఆయన ఒక్కసారిగా బరువు తగ్గారు. ఎన్టీఆర్ అంటే కాస్త చబ్బీగా కండలు తిరిగిన బాడీతో ఉండాలని, ఇంత స్లిమ్ అవ్వడం ఏంటని కొందరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ లుక్ ఆయనకు సూట్ కాలేదని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే కొందరేమో స్లిమ్‌గా అదిరిపోయారు అంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఇంతకీ ఎన్టీఆర్ లుక్ మీకెలా అనిపించింది? COMMENT
News April 5, 2025
బొండపల్లి: ఆన్‌లైన్ బెట్టింగ్.. ఏడుగురి అరెస్ట్

మండల కేంద్రమైన బొండపల్లిలో ఆన్‌లైన్ బెట్టింగ్ రాయుళ్లపై పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు జరిపారు. ఏడుగురిపై కేసు నమోదు చేసి ఇద్దరిని వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై యు.మహేశ్ తెలిపారు. వారి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News April 5, 2025
RGM: కానిస్టేబుల్ నుంచి పంచాయతీరాజ్ AE

రామగుండం NTPCపోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న తూర్పాటి సాయిలత పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్‌లో AEగా ఉద్యోగం సాధించింది. ఈ సందర్భంగా విధుల నుంచి రిలీవ్ అయి వెళ్తున్న సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో SIలు ఉదయ్ కిరణ్, మానస పోలీసు సిబ్బంది ఆమెను ఘనంగా సత్కరించారు. గతేడాది కానిస్టేబుల్‌గా బాధ్యతలు స్వీకరించిన సాయిలత అనతి కాలంలో AEగా ఉద్యోగ సాధించడం పట్ల అభినందించారు.