News March 20, 2025

భూపాలపల్లి: రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు షురూ

image

తెలంగాణ 10వ తరగతి పరీక్షలు ఈనెల 21నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే ఈ పరీక్షలకు 5,09,403 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. దీనికోసం 2,650 పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయా తేదీల్లో ఉ’9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

Similar News

News March 23, 2025

ఈ రోజు నమాజ్ వేళలు

image

మార్చి 23, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 5.06 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.18 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.23 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.28 గంటలకు
ఇష: రాత్రి 7.40 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 23, 2025

విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తాం: మంత్రి 

image

నేటికి పిల్లలు నేల మీద కూర్చుని చదవటం బాధాకరమని మంత్రి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే  అన్ని పాఠశాలలో బల్లలు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు శనివారం సాయంత్రం నెల్లూరు నగరంలోని పలు మున్సిపల్ పాఠశాలలను ఆయన పరిశీలించారు. వైకుంఠపురంలోని అంగన్వాడి కేంద్రాన్ని మరో భవనంలోకి తరలించాలని మంత్రి ఆదేశించారు. త్వరలోనే విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

News March 23, 2025

యువత బెట్టింగ్‌లకు పాల్పడవద్దు: సీఐ వాసంతి

image

యువకులు బెట్టింగ్‌లకు పాల్పడి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని జీడి నెల్లూరు సీఐ శ్రీనివాసంతి శనివారం తెలిపారు. ఐపీఎల్ మోజులో పడి యువకులు బానిసలు కాకూడదన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. బెట్టింగ్ గురించి సమాచారం ఉంటే తమకు ఇవ్వాలని ఆమె కోరారు. 

error: Content is protected !!