News March 20, 2025
భైoసా: ఆల్ ఇండియా పోటీలకు తపాలా ఉద్యోగులు

ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే క్రీడల్లో సత్తాచాటి జాతీయస్థాయికి ఎంపికయ్యారు జిల్లాకు చెందిన తపాలా ఉద్యోగులు వినోద్ కుమార్, నరేశ్‌కుమార్. HYDలో జరిగిన జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబర్చి అల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఢిల్లీలో జరిగే పోటీల్లో వీరు RSB HYD జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. అక్కడ కూడా ప్రతిభ చాటాలంటే ఆల్ ది బెస్ట్ చెప్పేయండి మరి.
Similar News
News December 13, 2025
మెస్సీ ఈవెంట్‌తో సంబంధం లేదు: ఫుట్‌బాల్ ఫెడరేషన్

మెస్సీ టూర్ సందర్భంగా కోల్‌కతా స్టేడియంలో జరిగిన ఘటనపై ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(AIFF) స్పందించింది. ‘అది PR ఏజెన్సీ నిర్వహించిన ప్రైవేటు ఈవెంట్. ఈ కార్యక్రమం నిర్వహణ, ప్లాన్, అమలు విషయంలో మేము ఇన్వాల్వ్ కాలేదు. మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఫెడరేషన్ నుంచి అనుమతి కోరలేదు’ అని స్పష్టం చేసింది. మరోవైపు మెస్సీ రావడం, ప్రేక్షకులకు చేతులు ఊపడం వరకే ప్లాన్‌లో ఉందని బెంగాల్ DGP రాజీవ్ కుమార్ తెలిపారు.
News December 13, 2025
కదిరిలో బాలుడిపై కుక్క దాడి.. తెగిన చెవి

కదిరి పట్టణంలోని నిజాంవలి కాలనీలో ఓ చిన్నారిపై వీధి కుక్క దాడి చేసింది. వీధిలో ఉన్న బాలుడిపై దాడి చేసిన కుక్క నోటితో పట్టుకుని లాక్కెళ్లిపోయింది. దీనిని గమనించిన ఓ వ్యక్తి కుక్కను తరిమివేశారు. ఈ దాడిలో బాలుడి చెవి సగం వరకు తెగిపడింది. గాయాలైన బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికైనా అధికారులు వీధి కుక్కల సమస్యపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
News December 13, 2025
జగిత్యాల: 2499 మందికి నవోదయ పరీక్ష.. 1860 మంది హాజరు

జవహర్ నవోదయ విద్యాలయం 2026–2027 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశానికి జిల్లాలోని 10 పరీక్ష కేంద్రాలలో నిర్వహించారు. జగిత్యాలలో 4, మెట్పల్లిలో 2, కోరుట్ల, మల్యాల, ధర్మపురి, వెల్గటూరులో ఒక్కో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు మొత్తం 2,499 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 1,860 మంది పరీక్షకు హాజరై 74.42 శాతం హాజరు నమోదు అయింది. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగాయి.


