News February 9, 2025
భైంసాలో రోడ్డు ప్రమాదం.. బాలుడు మృతి

భైంసా మండలం వానల్‌పాడ్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న అనిల్(14)ను హైవేపై గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో అనిల్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 13, 2025
MBNR: 2వ విడత ఎన్నికలు.. భారీ బందోబస్తు: ఎస్పీ

రెండో విడత పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో మొత్తం 1,249 మంది పోలీసు సిబ్బందిని ఎస్పీ డి.జానకి అన్నారు. ఎస్పీ-1, అదనపు ఎస్పీలు-2, డిఎస్పీలు-7, ఇన్స్పెక్టర్లు-29, సబ్ ఇన్స్పెక్టర్లు-66, మిగతా సిబ్బంది-1,134 మంది పోలీస్ సిబ్బంది జిల్లాలోని హన్వాడ, కోయిలకొండ, దేవరకద్ర, సీసీ కుంట, కౌకుంట్ల, మిడ్జిల్ మండలాలలో విధులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
News December 13, 2025
అనకాపల్లి: ‘రేపటి నుంచి ఇందన పాదుపు వారోత్సవాలు’

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు ఇందన పొదుపు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు విద్యుత్ పంపిణీ సంస్థ పర్యవేక్షక ఇంజినీర్ జి.ప్రసాద్ తెలిపారు. ఇందన పొదుపుపై జిల్లా, డివిజన్ కేంద్రాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. కళాశాలలు, హైస్కూల్స్‌లో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్వయం సహాయక బృందాల సభ్యులకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తామన్నారు.
News December 13, 2025
రాంగ్ రూట్‌లో వెళ్లకండి: ప్రకాశం పోలీసులు

ప్రకాశం జిల్లాలోని వాహనదారులకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఐటీ విభాగం పోలీసులు కీలక సూచనలు చేశారు. కొద్ది దూరమని రాంగ్ రూట్ ప్రయాణం చేస్తే ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు. దూరం కంటే ప్రాణం ముఖ్యమనే విషయాన్ని వాహనదారులు గమనించాలని కోరారు. రాంగ్ రూట్ వెళ్లకుండా వాహనదారులు సహకరించాలన్నారు.


