News March 18, 2025

భోగాపురంలో బాంబు పేలి కార్మికుడి మృతి

image

భోగాపురంలో రాళ్లను పేల్చేందుకు ఏర్పాటు చేసిన బాంబు పేలి కార్మికుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం సోమవారం జరిగింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల్లో భాగంగా రహదారి ఏర్పాటుకు అడ్డంగా ఉన్న బండరాళ్లను తొలగించే క్రమంలో బాంబులు పెడుతుండగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రామచంద్రపేటకు చెందిన కార్మికుడు కొత్తయ్య మృతి చెందాడు.

Similar News

News March 19, 2025

ఏలూరులో 715 మందికి రూప్ టాప్ సోలార్ యూనిట్లు

image

ప్రధాన మంత్రి సూర్యఘర్ బిజిలీయోజన కింద అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పూర్తిస్ధాయిలో అమలుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఇంతవరకు 715 మందికి రూప్ టాప్ సోలార్ యూనిట్లు మంజూరు చేశారని, మరో 305 పరిశీలనలో ఉన్నాయన్నారు. వివిధ కారణాలతో తిరస్కరించిన 415 దరఖాస్తులను పునఃపరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు.

News March 19, 2025

ADB: ‘స్వయం ఉపాధి ద్వారా యువత లబ్ధి పొందాలి’

image

స్వయం ఉపాధి పథకాల ద్వారా యువకులు లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన రాజీవ్ యువ వికాసం పథకానికి అన్ని వర్గాల యువత దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆధార్, కుల, ఆదాయ, పాన్ కార్డ్ తదితర వివరాలను ఉపయోగించి వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.

News March 19, 2025

ఏలూరు: పలు విద్యాసంస్థల బస్సులపై 8 కేసులు నమోదు

image

ఏలూరు ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ ఆదేశాల మేరకు బుధవారం ఏలూరు జిల్లాలోని పలు విద్యా సంస్థల బస్సులను మోటారు వాహనాల తనిఖీ అధికారులు తనిఖీ చేశారు. ఫిట్నెస్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన బీమా తదితర వాటిని పరిశీలించి, 8 బస్సులపై కేసులు నమోదు చేసినట్లు డీటీసీ కరీమ్ తెలిపారు. ఈ తనిఖీల్లో వాహనాల తనిఖీ అధికారులు ఎస్.బి.శేఖర్, వై.సురేశ్ బాబు, వై.ఎస్.వై.కళ్యాణి పాల్గొన్నారు.

error: Content is protected !!