News January 12, 2025
భోగి మంట వేస్తున్నారా?
సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 97036 22022కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.
Similar News
News January 12, 2025
నంద్యాల: రోడ్డు ప్రమాదంలో మాజీ జడ్పీటీసీ దుర్మరణం
ఆళ్లగడ్డ మండలం కోట కందుకూరుకు చెందిన టీడీపీ మాజీ జడ్పీటీసీ చాంద్ బాషా ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. కాశిరెడ్డి నాయన ఆశ్రమం సమీపంలోని పిరమిడ్ వద్ద బైక్‌పై వెళ్తూ ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనక వైపు నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోలుకోలేక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
News January 12, 2025
చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటే ఉపేక్షించేది లేదు: ఎస్పీ
పండగ పేరుతో అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటే ఉపేక్షించేది లేదని కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పండగ నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు పోలీస్ శాఖ ఇచ్చిన తగు సూచనలతో పాటు జాగ్రత్తలు పాటించాలని కోరారు. సంక్రాంతి పండగను జిల్లా ప్రజలందరూ సంతోషకర వాతావరణంలో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.
News January 12, 2025
గ్రీన్ కో సభ్యులతో పవన్ కళ్యాణ్ సెల్ఫీ
కర్నూలు జిల్లా పిన్నాపురం పర్యటనలో భాగంగా శనివారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రీన్ కో ప్రాజెక్టును సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు అధికారులు, ఉద్యోగులు, కార్మికులతో సెల్ఫీ దిగారు. ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా పవన్ కళ్యాణ్ స్వయంగా కారు డ్రైవ్ చేశారు. ఈ క్రమంలో ప్రాజెక్ట్ చీఫ్ ఆయనకు గ్రీన్ కో కంపెనీ గురించి వివరించారు.