News October 29, 2024

మంగళగిరి: పసికందును అమ్మేందుకు దంపతుల యత్నం

image

పసికందును అమ్మేందుకు ప్రయత్నించిన భార్యాభర్తలను మంగళగిరి టౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ వినోద్ కుమార్ తెలిపిన ప్రకారం.. విజయవాడకు చెందిన గుమ్మడి ఉమాదేవి, త్రినాథ్ అనే భార్యాభర్తలను అదుపులోకి తీసుకొని పసికందును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు పసికందును గుంటూరు సీడీపీఓకు అప్పగించామని, పసికందును ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే కోణంలో విచారణ చేస్తున్నట్లు చెప్పారు.

Similar News

News October 29, 2024

ప్రత్తిపాడు: తండ్రిని హత్య చేసిన కొడుకు

image

ప్రత్తిపాడు మండలం చిన్న కొండ్రుపాడులో మంగళవారం వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి-కొడుకుల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ క్రమంలో కుమారుడు చేతిలో తోక వెంకటరామయ్య(60) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 29, 2024

నందిగం సురేశ్ బెయిల్‌పై ముగిసిన వాదనలు

image

వెలగపూడిలోని మరియమ్మ అనే వృద్ధురాలి హత్య కేసులో హైకోర్టులో నందిగం సురేశ్ పిటిషన్ దాఖలు చేయగా మంగళవారం వాదనలు ముగిశాయి. బెయిల్ పిటిషన్ పై తీర్పు నవంబర్ 6న వెల్లడిస్తామని హైకోర్టు తెలిపింది. కాగా ఇటీవలే సురేశ్‌ను తుళ్ళూరు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇప్పటికే నందిగం సురేశ్ గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

News October 29, 2024

గుంటూరు: ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగులపై కత్తితో దాడి

image

గుంటూరులోని అరండల్ పేటలో ఓ ఇన్సూరెన్స్ కంపెనీపై వినియోగదారుడు దాడికి పాల్పడ్డాడు. సదరు ఇన్సూరెన్స్ కంపెనీలో వినియోగదారుడికి రావాల్సిన నగదు ఆలస్యం కావడంతో మంగళవారం ఇన్సూరెన్స్ కంపెనీలోని ఉద్యోగులపై కత్తితో దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై స్టేషన్‌కి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.