News March 25, 2025
మంగళగిరి: ప్రజా క్షేత్రంలో కనిపించని ఆర్కే

మంగళగిరి మాజీ ఎమ్మెల్యే YCP నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి (RK) 10 ఏళ్ల పాటు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పని చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి RK నియోజకవర్గంలో అందుబాటులో లేరు. కనీసం కార్యకర్తలకు, అనుచరులకు సైతం కనిపించకపోవడం వారిని నిరుత్సాహానికి గురి చేస్తోంది. చివరి ఎన్నికల్లో YCP తరపున పోటీ చేసిన మురుగుడు లావణ్య, కాండ్రు కమల ప్రజా క్షేత్రంలో కనిపించకపోవడం గమనార్హం.
Similar News
News March 31, 2025
గుంటూరు జిల్లా కలెక్టర్ ముఖ్య సూచనలు

రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు కావడంతో సోమవారం గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార (PGRS) కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. కావున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అర్జీలు ఇవ్వదలచుకున్న ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News March 30, 2025
తుళ్లూరు: నేడే పీ-4 కార్యక్రమం ప్రారంభం

ఏపీలో పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఆదివారం సాయంత్రం 4 గంటలకు పీ-4 కార్యక్రమం ప్రారంభించనుంది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 20 శాతం మంది నిరుపేదలకు ఉన్నత స్థితిలో ఉన్న 10 శాతం మంది సహాయం చేసేందుకే దీనిని చేపట్టనున్నారు. కార్యక్రమంలో దాదాపు 14వేల మంది పాల్గొంటారు. పేదలు, దాతలు, మంత్రులు, ప్రముఖులు హాజరయ్యేందుకు ఏర్పాట్లు జరిగాయి.
News March 30, 2025
వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివానం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, పంచాంగ శ్రవణం చేశారు. రాష్ట్రంలో ప్రజలందరికీ మేలు జరగాలని ఆకాంక్షించినట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, దొంతిరెడ్డి వేమారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పలువురు రాష్ట్ర వైసీపీ నాయకులు పాల్గొన్నారు.