News March 26, 2025
మంగళగిరి రైల్వే వంతెనకు కేంద్రం ఆమోదం

మంగళగిరి నగరంలోని నిడమర్రు రైల్వే వంతెన నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి లోకేశ్‌ల వినతుల మేరకు మంగళవారం ఎల్సీ 14వద్ద ఆర్వోబీనీ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సుమారు రూ.129.18 కోట్ల అంచనా వ్యయంతో.. కిలోమీటరు మేర 4 వరుసల రైల్వే వంతెన నిర్మాణం కానుంది. ఈ నిర్మాణం పూర్తి అయితే అటు రాజధానితో పాటు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ఉపయోగకరంగా ఉంటుంది.
Similar News
News March 29, 2025
తుళ్లూరు: సీఎం రూట్ మ్యాప్ పరిశీలించిన ఎస్పీ

P-4 కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు వెలగపూడి వద్ద ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్, అడిషనల్ ఎస్పీ సుప్రజా ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. అనంతరం స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా CM వచ్చే రూట్లో కూడా ఏరియా డామినేషన్ పార్టీలు తిరగనున్నట్లు చెప్పారు.
News March 29, 2025
మంగళగిరి: తిరువూరు టీడీపీ నేతలతో పార్టీ అధ్యక్షుడు భేటీ

తిరువూరు టీడీపీ కార్యకర్తలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శనివారం మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కొలికపూడి పై ఆరోపణలు చేస్తున్న రమేష్ రెడ్డి వ్యవహరం తమ దృష్టికి రాలేదని తెలిపారు. అతనిపై ఎవరూ మాకు ఫిర్యాదు చేయలేదన్నారు. పార్టీ కుటుంబం లాంటిదని కుటుంబంలో చిన్నచిన్న కలహాలు సహజమన్నారు. ఈ వ్యవహారానికి త్వరలోనే ఫుల్ స్టాప్ పెడతామన్నారు.
News March 29, 2025
గుంటూరులో గుర్తు తెలియని డెడ్ బాడీ కలకలం

గుంటూరులో గుర్తు తెలియని వ్యక్తి డెడ్ బాడీ కలకలం రేపుతుంది. 27వ తేదీన నాజ్ సెంటర్లో అనారోగ్యంతో పడిపోయి ఉండగా స్థానికులు సహాయంతో జిజిహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం మరణించారని కొత్తపేట పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఆచూకీ తెలిసినవారు కొత్తపేట పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాల్సిందిగా కోరారు.