News March 29, 2025

మంచిర్యాల: అర్ధరాత్రి దొంగల బీభత్సం

image

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్ ఏరియాలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో వారు నిద్రిస్తుండగానే దుండగులు బంగారం, వెండీ వస్తువులతో ఉడాయించారు. స్థానికుల వివరాలు.. BRS నాయకుడి ఇంటితో పాటు మరొకరి ఇంట్లోకి ప్రవేశించి ఇంటి తలుపులు తెరిచి 30తు. బంగారు వస్తువులు, కిలోన్నర వెండి ఎత్తుకుపోయినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

Similar News

News April 2, 2025

అనంతపురం జిల్లాలో HM సస్పెండ్

image

అనంతపురం జిల్లా ఆత్మకూరు ZPHS హెచ్‌ఎం శ్రీనివాస్ ప్రసాద్‌పై పాఠశాల విద్య కడప RJD శామ్యూల్ మంగళవారం సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆత్మకూరు ZPHSలో పరీక్ష రాసేందుకు 10th విద్యార్థిని వెళ్లింది. పరీక్ష జరిగే సమయంలో ఆ విద్యార్థిని ప్రశ్నాపత్రం మిస్ అయిందని చెప్పగా.. చీఫ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆమెను భుజంపై కర్రతో కొట్టారు. దీంతో విద్యార్థిని కాలర్ బౌన్ విరిగగా ఆయనను సస్పెండ్ చేశారు.

News April 2, 2025

HCU భూములపై NGTలో ఫిర్యాదు

image

హైదరాబాద్ HCU భూముల వేలంపాట అంశం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)కు చేరింది. వేలం పాట అనైతికం అని న్యాయవాది కారుపోతుల రేవంత్ చెన్నైలోని NGTలో ఫిర్యాదు చేశారు. వేలంపాటను అడ్డుకుని పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. నగరానికి కాలుష్యం నుంచి ఉపశమనం కలిగిస్తున్న ఇలాంటి ప్రాంతాలను నాశనం చేయడం సరికాదన్నారు. మరోవైపు ఈ అంశంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది.

News April 2, 2025

పెద్దాపురం: కాండ్ర‌కోట నూకాల‌మ్మ జాత‌ర‌లో విషాదం

image

పెద్దాపురం మండ‌లం కాండ్ర‌కోట నూకాల‌మ్మ జాతర‌లో విషాదం చోటు చేసుకుంది. మంగ‌ళ‌వారం రాత్రి ఇద్ద‌రు ఏలేరు కాలువ‌లోకి స్థాన్నానికి దిగి గ‌ల్లంతు అయ్యారు. స్థానికులు వివరాలు.. కాకినాడ‌, జ‌గ‌న్నాధ‌పురం బిర్యానీ పేట‌కు చెందిన పిర‌మాడి విశాల్ (7), కొప్పాడి బాలు (22) ఇద్ద‌రి గల్లంతవ్వగా బాలుడు మృత‌దేహం బుధ‌వారం ల‌భ్య‌మైంది. మరో మృత‌దేహం కోసం పెద్దాపురం ఎస్సై వి.మౌనిక ఆధ్వ‌ర్యంలో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

error: Content is protected !!