News March 27, 2025

మంచిర్యాల: ఈ నెల 28న మినీ జాబ్ మేళా

image

మంచిర్యాలలోని మిమ్స్ డిగ్రీ కాలేజీలో ఈ నెల 28న ఉదయం10.30గంటలకు మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రవికృష్ణ తెలిపారు. అపోలో ఫార్మసీ మంచిర్యాల, గోదావరిఖని, హైదరాబాద్‌లో ఫార్మసిస్ట్ 40, ట్రైనింగ్ ఫార్మాసిస్ట్ 20, ఫార్మసీ అసిస్టెంట్30, రిటైల్ ట్రైనీ అసిస్టెంట్10ఖాళీలు ఉన్నాయన్నారు.18నుంచి 35లోపు వయస్సు, అర్హత కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News April 1, 2025

ALERT.. రేపటి నుంచి వర్షాలు

image

తెలంగాణలో రేపటి నుంచి ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు, ఎల్లుండి ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురుస్తుందని పేర్కొంది. దీంతో పాటు గంటకు 40-50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

News April 1, 2025

రైతుల కళ్లలో కన్నీళ్లే మిగిలాయి: KCR

image

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వింతైన పాలన సాగిస్తోందని మాజీ CM KCR దుయ్యబట్టారు. మార్పు కోరుకుంటూ ఆ పార్టీని అధికారంలోకి తెచ్చిన రైతుల కళ్లలో కన్నీళ్లే మిగిలాయని విమర్శించారు. రైతులకు ఈ దుస్థితి వస్తుందని కలలోనూ తాను ఊహించలేదన్నారు. ప్రభుత్వ చర్యలతో రైతులు, వివిధ వర్గాల ప్రజలు మనోధైర్యం కోల్పోతున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ధైర్యం ఇచ్చేలా వరంగల్ బహిరంగ సభ(APR 27) ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

News April 1, 2025

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: వెంకట్ రెడ్డి

image

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కనగల్ మండలం జి.యడవల్లి గ్రామంలోని ఎన్.వి.కె ఫంక్షన్ హాల్ హాల్‌లో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఐ.కె.పి సెంటర్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించారు.

error: Content is protected !!