News February 28, 2025

మంచిర్యాల: చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు

image

చెల్లని చెక్కు ఇచ్చిన వ్యక్తికి ఏడాది జైలు శిక్షతో పాటు తీసుకున్న మొత్తం నష్టపరిహారం ఇవ్వాలని రెండో అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి కే.నిరోషా తీర్పునిచ్చారు. సీసీసీ నన్పూర్‌కు చెందిన వంటల సత్యనారాయణ రెడ్డి వద్ద మేకల సత్యనారాయణ రెడ్డి 2017లో రూ.8 లక్షలు అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లించే క్రమంలో చెక్ బౌన్స్ అయింది. బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, నేరం రుజువుకావడంతో శిక్ష విధించారు.

Similar News

News December 14, 2025

జగిత్యాల జిల్లాలో పోలింగ్ శాతం ఎంతంటే?

image

జగిత్యాల జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు మండలాల వారీగా పోలింగ్ ఇలా నమోదైంది. బీర్పూర్ మండలంలో 18.31%, జగిత్యాల మండలంలో 22.14%, జగిత్యాల రూరల్ మండలంలో 23.41%, కొడిమ్యాల మండలంలో 19.41%, మల్యాల మండలంలో 17.39%, రాయికల్ మండలంలో 22.11%, సారంగపూర్ మండలంలో 19.84% పోలింగ్ జరిగింది. అన్ని మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

News December 14, 2025

సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల సంక్షేమానికి చట్టం రావాలి: TG హైకోర్టు

image

సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం చట్టం తేవాలని TG హైకోర్టు అభిప్రాయపడింది. ఉద్యోగుల హక్కులు హరించే అధికారం ఎవరికీ లేదంది. సర్వీస్ అగ్రిమెంట్‌ను పాటించకుండా రాజీనామా చేస్తున్నందుకు ₹5.9L చెల్లించాలని కంపెనీ డిమాండ్ చేయడంపై ఓ ఉద్యోగి కోర్టుకెక్కారు. విచారణ జరిపిన కోర్టు ఏ ప్రాతిపదికన కంపెనీ పరిహారాన్ని నిర్ణయించిందో తేల్చాలని కార్మికశాఖను, అతని రాజీనామాను ఆమోదించాలని సంస్థను ఆదేశించింది.

News December 14, 2025

విజయనగరం కలెక్టరేట్‌లో రేపు PGRS: కలెక్టర్

image

విజయనగరం కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు PGRS నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్జీదారులు పూర్వపు స్లిప్పులతో రావాలని సూచించారు. అర్జీల కోసం 1100 కాల్ సెంటర్, Meekosam.ap.gov.in సేవలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.