News February 9, 2025

మంచిర్యాల జిల్లాలో నేటి TOP NEWS

image

*అంకుశం వైపు పులి కదలికలు*వైభవంగా వేలాల గట్టు మల్లన్న గిరి ప్రదక్షిణ *బార్‌లో దాడి ఘటనలో ముగ్గురి రిమాండ్*రాజకీయ జోక్యంతో దిగజారుతున్న సింగరేణి*గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

Similar News

News March 14, 2025

నరసరావుపేట: జిల్లా కలెక్టర్ హెచ్చరికలు

image

సహకార సంఘ బ్యాంకుల్లో కంప్యూటరీకరణ చేసే విషయంలో పనిచేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు హెచ్చరించారు. కలెక్టరేట్లో సహకార సంఘం అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. మాట్లాడుతూ సంవత్సరం నుంచి కంప్యూటరీకరణ జరుగుతుందని పురోగతి సరిగా లేదని అన్నారు. సరిగా పనిచేయని సంఘ సీఈవో పై ఏమి చర్యలు తీసుకున్నారని జిల్లా సహకార అధికారులను ప్రశ్నించారు.

News March 14, 2025

సూర్యాపేట: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

image

సూర్యాపేటలో ఓ చెట్టుకు విరబూసిన మోదుగ పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకుందాం. ఆరోగ్యంగా ఉందాం. HAPPY HOLI

News March 14, 2025

ఆసిఫాబాద్ ప్రజలకు ఎస్పీ సూచనలు

image

ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా హోలీ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. హోలీ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలని, నదులు, వాగులు, చెరువులకు ఈతరాని వారు వెళ్లవద్దని, తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై జాగ్రత్తలు వహించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

error: Content is protected !!