News April 5, 2025
మంచిర్యాల: మరో మైలురాయిని చేరుకున్న సింగరేణి

బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి సంస్థ మరో కీలక మైలురాయిని చేరుకుందని INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నారు. సింగరేణి డైరెక్టర్(పా) వెంకటేశ్వర్లుతో యూనియన్ నాయకులు సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తీవ్ర వర్షాలు, కఠినమైన వేసవి పరిస్థితుల మధ్య 69.01మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 65.27మిలియన్ టన్నుల డిస్పాచ్‌ను సాధించి సింగరేణి సంస్థ అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తోందన్నారు.
Similar News
News April 7, 2025
ఈరోజు నమాజ్ వేళలు

ఏప్రిల్ 7, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 4.53 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.06 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.18 గంటలకు
అసర్: సాయంత్రం 4.44 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.31 గంటలకు
ఇష: రాత్రి 7.44 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News April 7, 2025
శుభ ముహూర్తం (07-04-2025)(సోమవారం)

తిథి: శుక్ల దశమి రా.11.14 వరకు
నక్షత్రం: పుష్యమి ఉ.9.58 వరకు
శుభసమయం: ఉ.6.25 నుంచి ఉ.7.01 వరకు
రాహుకాలం: ఉ.7.30-ఉ.9.00 వరకు
యమగండం: ఉ.10.30-మ.12.00 వరకు
దుర్ముహూర్తం: మ.12.24-మ.1.12, మ.2.46-మ.3.34
వర్జ్యం: సా.6.03-సా.7.39 గంటల వరకు
అమృత ఘడియలు: ఉ.7.50-ఉ.9.26 వరకు
News April 7, 2025
HYD: గ్రేటర్లో కల్తీరాయుళ్లకు ఇక తప్పవు కష్టాలు

మహానగరంలోని హోటళ్లలో ఎక్కడ చూసినా కల్తీ ఆహారమే దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సిటీలో అనేక చోట్ల అధికారుల తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది. దీంతో నగరంలో ఆరు ఆహార పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని GHMC నిర్ణయించింది. వీటి ఏర్పాటు కోసం రూ.30 కోట్ల నిధులు (ఒక్కో కేంద్రానికి రూ.6 కోట్లు) కావాలని ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు నివేదికలు పంపారు. నిధులు విడుదలైతే ఫుడ్ టెస్టింగ్ సిటీలో జోరందుకుంటుంది.