News March 26, 2025

మంచిర్యాల: ‘యోగ, వ్యాయామం అలవాటు చేసుకోవాలి’

image

మంచిర్యాల జిల్లా స్థాయి మెంటల్ హెల్త్ అండ్ లీగల్ రైట్స్ అవగాహన కార్యక్రమనికి జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్ హాజరయ్యారు. నేటి సమాజంలో స్మార్ట్ ఫోన్ వాడకం పెరగడం వల్ల మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయన్నారు. స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించి యోగ, వ్యాయామం వంటివి అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. మానసిక ఒత్తిడికి గురైనప్పుడు సహాయం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్14416ను సంప్రదించాలని సూచించారు.

Similar News

News April 1, 2025

శ్రీ భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

image

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి శ్రీ భద్రకాళి దేవస్థానంలో చైత్ర మాసం మంగళవారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.

News April 1, 2025

నారాయణపేట: భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

image

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని తీలేరు గ్రామంలో చోటుచేసుకుంది. మరికల్ ఎస్ఐ రాము కథనం మేరకు.. తీలేరు గ్రామానికి చెందిన సుభాష్‌కు తన భార్యకు కొన్ని రోజుల క్రితం గొడవలు జరగగా ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కాపురానికి రమ్మన్నా ఆమె రాకపోవడంతో మనస్తాపం చెందిన సుభాష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.

News April 1, 2025

ప.గో: రెండు రోజుల్లో 10 టన్నుల చికెన్ అమ్మకాలు

image

ప.గో జిల్లా వ్యాప్తంగా ఆది, సోమవారాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పెరిగాయి. మొన్నటి వరకు బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ తినేవాళ్లు తగ్గడంతో ధర అమాంతంగా రూ.200 దిగువకు పడిపోయింది. అయితే ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ప్రభావం లేకపోవడంతో కొనుగోళ్లు పెరగడం, సరఫరా తగ్గడంతో కేజీ రూ.300కు పెరిగింది. ఉగాది, రంజాన్ పండుగ రోజుల్లో జిల్లాలో 10 టన్నులకు పైగా చికెన్ కొనుగోలు చేసినట్లు వ్యాపారస్తులు తెలుపుతున్నారు.

error: Content is protected !!