News April 7, 2025
మంచిర్యాలలో ఏడుగురు అరెస్ట్

మంచిర్యాలలోని తిలక్‌నగర్‌లో పేకాట స్థావరంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో చెట్ల పొదల్లో డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో గోదార్ల రమేష్, దేవసాని కుమార్, ఆటకారి శ్రీను, వనం లక్ష్మన్, మాచర్ల వెంకటేష్, తోకల శ్రీనివాస్, గౌరీ ప్రసాద్ ఉన్నారు. వారి నుంచి రూ.2,100 నగదు, 4 మొబైల్స్, 2 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News April 16, 2025
పాలమూరు జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!

✔ఆర్థిక శాస్త్రం దేశాభివృద్ధిలో ముఖ్యభూమిక:PU ప్రిన్సిపల్✔రజతోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరణ✔ఉమ్మడి జిల్లాల్లో భారీ వాన✔పోలేపల్లికి పోటెత్తిన భక్తులు✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్✔పలుచోట్ల వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ✔మహమ్మదాబాద్: పట్టపగలే భారీ చోరీ పైన టూల్ బార్లో లొకేషన్ మీద, తర్వాత ‘వి’ సింబల్‌ని క్లిక్ చేసి మన గ్రామ/మండల/నియోజకవర్గ/జిల్లా ఎడిషన్ వార్తలను కేవలం 5 నిమిషాల్లోనే తెలుసుకోండి.
News April 16, 2025
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా టీబీ రోగులకు పౌష్టికాహార కిట్లు

ఉప్పల్ పీహెచ్సీలో టీబీ ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా ప్లాన్ ఇండియా ఆర్గనైజేషన్ ద్వారా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా 750 టీబీ రోగులకు 1,500 పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీబీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం, జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఉమా గౌరీ, టిబి డాక్టర్ శ్రీదేవి పాల్గొన్నారు. మందులతో పాటు పోషకాహారం తీసుకోవడం వల్ల త్వరగా కోలుకోవచ్చని అధికారులు తెలిపారు.
News April 16, 2025
5 నిమిషాల్లో HYD జిల్లా చుట్టేయండిలా!

మీ జిల్లాలో జరిగిన అన్ని విషయాలు తెలుసుకునేందుకు Way2News యాప్‌లో ఇలా చేయండి. యాప్ ఓపెన్ చూస్తే రైట్ సైడ్ టాప్ మీ లొకేషన్ పేరుపై క్లిక్ చేయండి. పక్కన V సింబల్‌పై క్లిక్ చేస్తే 4 ఆప్షన్స్ మీ గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా చూపిస్తుంది. వాటిలో జిల్లాపై క్లిక్ చేస్తే 5MINలో మీ జిల్లా మొత్తం ఓ రౌండ్ వేయొచ్చు.