News June 13, 2024
మంచిర్యాలలో గోడ కూలి ముగ్గురు మృతి
మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలో భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు గోడ కూలి ముగ్గురు కూలీలు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతిచెందినవారిలో ఇద్దరిని శంకర్, హనుమంతుగా గుర్తించారు. కాగా మరో కూలీ పోషన్న శిథిలాల కింద చిక్కుకున్నాడు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 15, 2025
క్రీడలతో శారీరక ఆరోగ్యం: బోథ్ MLA
నేరడిగొండ మండలంలోని బొందిడిలో నిర్వహించిన ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని టాస్ వేసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక ఆరోగ్యం కలుగుతుందన్నారు. అనంతరం యువకులతో కలిసి బ్యాటింగ్ చేసి సందడి చేశారు.
News January 15, 2025
జాతీయస్థాయి పరీక్షలో నార్మూర్ అమ్మాయి ప్రతిభ
నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామానికి చెందిన సోంకామ్లే సోని ప్రతిభను చాటింది. నేషనల్ మెటీరియాలజీ ఒలంపియాడ్ ఎర్త్ సైన్స్ అండ్ క్లైమేట్ ఛేంజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలో జాతీయస్థాయిలో రెండవ ర్యాంకు సాధించింది. ఢిల్లీలో శాస్త్రవేత్తల చేతులమీదుగా అవార్డును అందుకుంది.
News January 15, 2025
బెజ్జూర్: తల్లిదండ్రులు మందలించారని ఆత్మహత్య
బెజ్జూర్ మండల కేంద్రానికి చెందిన కావిడె నవీన్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తండ్రి దేవయ్య ఇచ్చిన ఫిర్యాదు పై ఎస్సై ప్రవీణ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో తల్లిదండ్రులు నవీన్‌ను మందలించారు. దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి చనిపోయినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు..