News March 28, 2025

మండపేట ఎమ్మెల్సీ తోట అధిష్ఠానంపై అలిగారా..!

image

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అధిష్ఠానంపై అలిగారని పార్టీ క్యాడర్‌లో వదంతులు చక్కెర్ల కొడుతున్నాయి. 25 ఏళ్ల సీనియర్ నాయకుడు అయిన తనను కాదని కాకినాడ జిల్లా అధ్యక్ష పదవిని రాజాకు కట్టబెట్టడంపై అగ్రహంగా ఉన్నారని గుసగసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఉత్తరాంధ్ర కో ఆర్డీనేటర్‌గా కన్నబాబుని పదవి వరించింది. దీనితో తనను నిర్లక్ష్యం చేస్తుండటంతో తటస్థంగా ఉంటున్నారని సన్నిహత వర్గాల్లో చర్చనీయంశంగా మారింది.

Similar News

News April 2, 2025

నారాయణపేట: ‘విద్యార్థుల అక్రమ అరెస్టులు ఖండిస్తున్నాం’

image

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో అన్నారు. యూనివర్సిటీలో భూములను కాపాడేందుకు బీఆర్ఎస్ తరఫున విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా భూములు తీసుకునే విషయంలో వెనక్కి తగ్గాలని సూచించారు.

News April 2, 2025

MNCL: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

మంచిర్యాలలోని రాళ్లపేటకు చెందిన తెలంగాణ హోటల్ యజమాని ప్రభుదాస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సోమవారం రాత్రి మద్యం తాగి వచ్చిన ప్రభుదాస్‌ను భార్య మందలించగా ఇరువురి మధ్య గొడవ జరిగింది. అనంతరం ఇంటికి వెళ్లని ఆయన ఇవాళ తెల్లవారుజామున హోటల్ పక్కన గల్లీలో ఒక ఇంటి ముందు సృహ కోల్పోయి ఉన్నారు. అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడు. ఈ మేరకు ఎస్సై వినీత కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News April 2, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

error: Content is protected !!