News March 15, 2025
మంత్రి ఉత్తమ్‌తో తుమ్మల భేటీ..!

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సీతారామ ప్రాజెక్ట్ మిగిలిన పనులపై సమావేశమయ్యారు. తుమ్మల మాట్లాడుతూ.. భూసేకరణను వేగవంతం చేయాలని భద్రాద్రి, ఖమ్మం జిల్లా కలెక్టర్‌లను ఆదేశించారు. సత్తుపల్లి ట్రంక్ పనులు, 4వ పంపు హౌస్ నిర్మాణాన్ని ఈ ఏడాదిలో పూర్తి చేయాలని సూచించారు. పని నాణ్యత, ఖర్చు నియంత్రణ, సమయపాలనపై అధికారులు దృష్టి పెట్టాలని మంత్రి తుమ్మల సూచించారు.
Similar News
News March 16, 2025
అల్లూరి: కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు: కలెక్టర్

10th తరగతి పరీక్షలు రేపటి నుంచి జరగనున్న నేపథ్యంలో అల్లూరి కలెక్టర్ దినేశ్ కుమార్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని వీసీలో హెచ్చరించారు. ఇన్విజిలేటర్లు మాస్ కాపీ లేకుండా చూడాలని, ఉత్తీర్ణత పెంచాలని కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే క్రిమినల్ కేసులు తప్పవన్నారు. జిల్లాలో 11,762 మంది 71 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. వీటిలో 20 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.
News March 16, 2025
టీ పాలెం: పురుగుమందు కలిపిన నీళ్లు తాగి వ్యక్తి మృతి

పురుగుమందు కలిసిన మంచినీళ్లు తాగి రైతు మృతి చెందిన ఘటన తిరుమలాయపాలెం మండలం సోలిపురం పిక్యాతండాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. బీ.రామోజీ అనే వ్యక్తి కాకరవాయిలో భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. తన పొలం పక్క రైతు రవి పాత కక్షల నేపథ్యంలో తన వెంట తెచ్చుకున్న నీళ్లలో పురుగుమందు కలిపాడు. ఆ నీటిని తాగి రామోజీ అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News March 16, 2025
సమయానికి చేరుకునేలా ఉచిత బస్సులు: మంత్రి రాంప్రసాద్

AP: టెన్త్ విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ఉచితంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అరగంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకొని, జయప్రదంగా పరీక్షలు రాయాలన్నారు. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. రేపటి నుంచి 6.15లక్షల మంది టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నారు.