News January 9, 2025

మంత్రి నారా లోకేశ్ అనంతపురం పర్యటన రద్దు

image

తిరుపతిలో తొక్కిసలాట కారణంగా మంత్రి నారా లోకేశ్ అనంతపురం జిల్లా పర్యటన రద్దయింది. బైరాగిపట్టెడలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో మంత్రి నేటి పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇవాళ అనంతపురంలో జరిగే ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు లోకేశ్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకావాల్సి ఉంది. సినీ ప్రముఖులతోనే ఈవెంట్ యథాతథంగా కొనసాగనుంది.

Similar News

News January 10, 2025

సెంట్రల్ సిల్క్ బోర్డు సమావేశంలో పాల్గొన్న అనంతపురం ఎంపీ

image

బెంగళూరులోని రాడిసన్ బ్లూ హోటల్‌లో జరిగిన సెంట్రల్ సిల్క్ బోర్డు సమావేశంలో గురువారం అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టు పరిశ్రమ అభివృద్ధికి అనేక కీలక అంశాలను ఆయన ప్రస్తావించి, వాటిపై వినతి పత్రాలు సమర్పించారు. రాష్ట్రానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని, రైతులకు ఇన్సెంటివ్ అందించాలని, రీలింగ్ యూనిట్ మెషిన్లకు జీఎస్టీ రద్దు చేయాలని కోరారు.

News January 9, 2025

పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలి: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భూసేకరణకు సంబంధించి అన్ని పనులను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఎన్హెచ్‌ఏఐ, రైల్వే, రోడ్లు భవనాలు, అటవీ శాఖ, చిన్న నీటిపారుదల, భూసేకరణ అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో జరిగే భూసేకరణకు సంబంధించి జరిగే సమావేశాలలో ఎన్‌హెచ్ పీడీ హాజరుకావాలని హెచ్చరించారు.

News January 9, 2025

ఆలయాల వద్ద ప్రత్యేక భద్రత: ఎస్పీ

image

అనంతపురం జిల్లాలో ప్రముఖ దేవాలయాల వద్ద భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. శుక్రవారం జరగనున్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయాలకు వచ్చే ప్రజలందరూ పోలీసులకు సహకరించి స్వామివారిని దర్శించుకోవచ్చని తెలిపారు.