News June 15, 2024

మంత్రి నారాయణను కలిసిన నెల్లూరు కలెక్టర్, ఎస్పీ

image

పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణను శనివారం నెల్లూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణ్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ చింతా రెడ్డిపాలెంలో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చాలు అందజేసి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, శాంతిభద్రతలపై చర్చించారు.

Similar News

News October 3, 2024

పరిశుభ్రతే జాతిపితకు అసలైన నివాళులు; కలెక్టర్

image

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం ముగింపు కార్యక్రమాన్ని నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతే జాతిపితకు అసలైన నివాళులు అని అన్నారు. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో మున్సిపల్ కార్మికుల సేవలు చిరస్మరణీయం అని అన్నారు.

News October 2, 2024

చేజర్ల ఎమ్మార్వో నుంచి రూ.3.5 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

image

చేజర్ల తహశీల్దార్‌‌ను బెదిరించి సైబర్ నేరగాళ్లు రూ.3.5 లక్షలు దొచేశారు. సైబర్ నేరగాళ్లు చేజర్ల తహశీల్దార్‌ వెంకటరమణకు కాల్ చేసి అదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు బెదిరించారు. అనంతరం వారు ఐదు లక్షలు డిమాండ్ చేయగా తహశీల్దార్ మూడున్నర లక్షలు నగదు ఇచ్చారు. అనుమానం వచ్చి సంగం సీఐ వేమారెడ్డికి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News October 2, 2024

నెల్లూరు: KGBVలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

నెల్లూరు జిల్లాలోని కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన, బోధనేతర సిబ్బందిని పొరుగుసేవల ప్రాతిపదికన ఏడాది కాలానికి భర్తీ చేసేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీసీ ఉషారాణి పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు apkgbv.apcfss.in వెబ్సైట్ ద్వారా రూ.250 దరఖాస్తు రుసుం చెల్లించి ఈనెల 10వతేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నా.