News February 6, 2025

మంత్రి సంధ్యారాణికి 19వ ర్యాంక్

image

సీఎం చంద్రబాబు మంత్రులకు గురువారం ర్యాంకులు ప్రకటించారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఈ ర్యాంకుల్లో పార్వతీపురం మన్యం జిల్లా మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి 19వ ర్యాంక్ వచ్చింది. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సీఎం మంత్రికి సూచించారు.

Similar News

News February 7, 2025

ASF: ‘అభ్యర్థులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి’

image

తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ డెవలప్మెంట్ కేంద్రంలో అభ్యర్థులకు ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆసిఫాబద్ అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం ఆసిఫాబాద్‌లోని టాస్క్ సెంటర్‌ను డీఆర్డీవోతో కలిసి సందర్శించారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు ఏకాగ్రతతో చదవాలన్నారు.

News February 7, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔MBNR:రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి✔GDWL:ఘోర రోడ్డు ప్రమాదం..డ్రైవర్ మృతి✔కోడేరులో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య✔బాలానగర్:గురుకులంలో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య✔కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన బోగస్:BJP✔పెండింగ్ చలాన్లు కట్టేయండి:SIలు✔నారాయణపేటలో సినిమా షూటింగ్✔పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేయాలి:కలెక్టర్లు✔GDWL: కన్నుల పండుగగా మధ్వనవమి పూజలు

News February 7, 2025

భువనగిరి: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

బొమ్మాయిపల్లి, నాగిరెడ్డిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య గల ట్రాక్‌పై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసుల వివరాలిలా.. పోచంపల్లి మండలం జూలూరుకి చెందిన కేతం గోపాలకృష్ణ మానసిక స్థితి సరిగా లేదు. సికింద్రాబాద్ నుంచి విష్ణుపురం వైపు వెళ్లే ఆఫీసర్ స్పెషల్ ట్రైన్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

error: Content is protected !!