News March 11, 2025
మంత్రిత్వ శాఖ జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న కలెక్టర్

న్యూఢిల్లీ నుంచి భారత ప్రభుత్వం, జల్ శక్తి మంత్రిత్వ శాఖవారు జల్ శక్తి అభియాన్ “జల్ సంచయ్ జన్ భగీదారి”పై అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. “జెల్ సంచయ్ జన్ భగీదారి”పై దృష్టి సారించి వర్షాన్ని ఒడిసి పట్టీల చర్యలు చేపట్టాలని సోమవారం అన్నారు. జిల్లాలలో పురోగతిపై వర్చువల్ విధానంలో జల్ శక్తి మంత్రిత్వ శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమీక్ష నిర్వహించారు.
Similar News
News March 12, 2025
తాత్కాలికంగా ఆ రైలు అనంతపురం వరకే!

నంద్యాల మీదుగా ప్రయాణించే మచిలీపట్నం-ధర్మవరం(17215), ధర్మవరం-మచిలీపట్నం (17216) రైలు తాత్కాలికంగా అనంతపురం-ధర్మవరం మధ్య రద్దు చేశారు. ధర్మవరంలోని ప్లాట్ ఫాం నంబర్ 5పై జరుగుతున్న మరమ్మతుల కారణంగా ఈ నెల 12 నుంచి 30వ తేదీ వరకు ఈ రైలు మచిలీపట్నం నుంచి అనంతపురం వరకు మాత్రమే ప్రయాణిస్తుందన్నారు. అలాగే ఈనెల 13 నుంచి 31వ తేదీ వరకు ఈ రైలు అనంతపురం నుంచే బయలుదేరి మచిలీపట్నం వెళ్తుంది.
News March 12, 2025
ఫ్రీ హోల్డ్ సర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం వారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంగళవారం అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సుల PGRS అర్జీలను త్వరితగతిన పూర్తి చేయాలని, రెండో విడత రీ సర్వేకు సంబంధించి మండలానికి రెండు గ్రామాలను ఎంపిక చేసి రీ సర్వే పనులు ప్రారంభించాలన్నారు. ఫీడ్ బ్యాక్ తదితర అంశాలపై కలెక్టర్‌తో సీసీఎల్ఏ & స్పెషల్ సీఎస్ జయలక్ష్మి సమీక్ష నిర్వహించారు.
News March 11, 2025
ATP: అన్ని అంశాల్లో జిల్లా టాప్ – 6లో ఉండాలి- కలెక్టర్

పంచాయతీ సెక్టర్, GSWS తదితర అంశాలలో అనంతపురం జిల్లా టాప్ – 6లో ఉండేందుకు అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పలు శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. MSME సర్వేలో పురోగతి తీసుకొచ్చి 24 గంటల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.