News April 4, 2025
మంథని: వామన్‌రావు దంపతుల హత్య కేసు (UPDATE)

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గట్టు వామన్‌రావు న్యాయవాద దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. రికార్డులను పరిశీలించిన తర్వాతే సీబీఐ విచారణ జరపాలా? లేదా? అనే విషయాన్ని నిర్ణయిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
Similar News
News April 5, 2025
కరీంనగర్ వాసులూ.. అప్లై చేశారా..?

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్‌కమ్ సర్టిఫికెట్స్‌తో ఆన్‌లైన్‌లో అప్లై చేసి హార్డ్ కాపీలను కరీంనగర్ జిల్లాలోని స్థానిక MPDO ఆఫీస్‌లో ఇవ్వాలి. SHARE
News April 5, 2025
గ్రూప్-1లో మెరిసిన గంగాధర ఎస్ఐ

కరీంనగర్ జిల్లా గంగాధర మండల పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న వంశీ కృష్ణ టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో 390వ ర్యాంక్ సాధించాడు. ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే గ్రూప్-1 పరీక్ష రాయగా మెరుగైన ర్యాంక్ సాధించాడు. దీంతో ఆయనకు మండల ప్రజలు పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.
News April 5, 2025
కరీంనగర్ స్మార్ట్ సిటీ పెండింగ్ పనులపై సమీక్ష

కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధిలో భాగంగా శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, ఆర్వీ కన్సల్టెన్సీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్మార్ట్ సిటీ లిమిటెడ్‌లో అభివృద్ధి పనులపై చర్చించి వేగంగా పూర్తి చేయాలని తెలిపారు.