News February 12, 2025

మంథని: సొమసిల్లి పడిపోయిన వృద్ధురాలు మృతి

image

మంథని పట్టణం అంబేడ్కర్ చౌరస్తాలో చీర్ల శంకరమ్మ (65) వృద్ధురాలు కూరగాయలు అమ్ముకుంటూ అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయింది. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించి వృద్ధురాలు మరణించినట్లు వెల్లడించారు. వృద్ధురాలిది భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కొంత కాలంగా మంథనిలో కూరగాయలు అమ్ముతూ జీవనం కొనసాగిస్తుందని స్థానికులు చెబుతున్నారు.

Similar News

News February 12, 2025

కాకినాడ జిల్లా వాసులకు ALERT

image

కాకినాడ జిల్లా బర్డ్ ఫ్లూ వ్యాపిస్తోందన్న ప్రచారంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రతి మండలానికి రెండు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా పశువర్ధక శాఖ ప్రకటించింది. మంగళవారం మొత్తం 42 బృందాలు జిల్లా వ్యాప్తంగా పరిశీలించాయి. 82 ఫారాలలో 62 లక్షల కోళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఎక్కడైనా కోళ్ల మరణాలు జరిగితే వెంటనే అధికారులు తెలియజేయాలని ఆదేశాలిచ్చింది.

News February 12, 2025

ఛాంపియన్స్ ట్రోఫీకి AUS టీమ్ ప్రకటన, స్టార్ బౌలర్లు దూరం

image

ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా ఫైనల్ స్క్వాడ్‌ను ప్రకటించింది. వ్యక్తిగత కారణాలతో మిచెల్ స్టార్క్ ఈ టోర్నీకి దూరమయ్యారని తెలిపింది. ఇప్పటికే కమిన్స్, హేజిల్ వుడ్, మార్ష్ గాయాలతో వైదొలిగిన సంగతి తెలిసిందే.

టీమ్: స్మిత్(C), అబాట్, కేరీ, డ్వార్షుయిస్, ఎల్లిస్, మెక్‌గుర్క్, హార్డీ, హెడ్, ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, లబుషేన్, మాక్స్‌వెల్, సంఘ, షార్ట్, జంపా. ట్రావెలింగ్ రిజర్వ్: కూపర్ కొన్నోలీ.

News February 12, 2025

జేఈఈలో జిల్లా విద్యార్థుల ప్రతిభ

image

జేఈఈ మెయిన్ సెషన్-1లో అనంతపురం, సత్యసాయి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. అనంతపురానికి చెందిన నితిన్ అగ్నిహోత్రి 99.99 పర్సంటైల్, గాండ్లపెంట మండలం సోమామాజులపల్లికి చెందిన ఓం కిరణ్ 99.91, అనంతపురం అశోక్ నగర్‌కు చెందిన అసిఫ్ 99.48, అనంతపురానికి చెందిన భావ, విశాల్ 99.43, 99.36 పర్సంటైల్‌తో సత్తా చాటారు.

error: Content is protected !!