News February 12, 2025
మందమర్రి PHCని సందర్శించిన DMHO
మందమర్రిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని గదులతో పాటు ఆరోగ్య కేంద్రం పరిధిలోనే ఉన్న క్వార్టర్లను వారం లోపల శుభ్రం చేయించాలని ఆదేశించారు.
Similar News
News February 13, 2025
ఉన్నత స్థానంలో స్థిరపడాలి: అడిషనల్ కలెక్టర్
ప్రతి విద్యార్థి బాగా చదువుకొని జీవితంలో ఉన్నతమైన స్థానంలో స్థిరపడాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆకాంక్షించారు. హవేలీ ఘన్పూర్ మండలం బూరుగుపల్లి గ్రామంలో వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మమేకమై మెనూ పరిశీలించి వారితో కలిసి భోజనం చేశారు. పిల్లల బాగోగులు తెలుసుకున్నారు.
News February 13, 2025
KMR: కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రాష్ట్ర కన్వీనర్ ఔట్
నిజాంసాగర్ మండలం వెల్గనూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ రామలింగంను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆరోపణలు రావడంతో రాష్ట్ర ఓబీసీ విభాగం ఛైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News February 13, 2025
ఇంగ్లండ్ జట్టుపై కెవిన్ పీటర్సన్ తీవ్ర ఆగ్రహం
భారత్‌తో ODI సిరీస్‌లో ENG జట్టు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ ఆటగాళ్లు కేవలం ఒకే ఒక్క ప్రాక్టీస్ సెషన్ ఆడారు. వారి నిర్లక్ష్యం చూసి నేను షాక్ తిన్నాను. మధ్యలో గోల్ఫ్ మాత్రం ఆడుకున్నారు. వారికి జీతం ఇచ్చేది దేశం కోసం క్రికెట్ ఆడటానికే గానీ గోల్ఫ్ ఆడుకోవడానికి, టూర్‌ని ఎంజాయ్ చేయడానికి కాదు’ అని మండిపడ్డారు.