News February 2, 2025

మందమర్రి ఏరియాలో 91%బొగ్గు ఉత్పత్తి: GM

image

మందమర్రి ఏరియాలో జనవరి మాసానికి నిర్దేశించిన లక్ష్యానికి 91% బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా GM దేవేందర్ తెలిపారు. శనివారం GMకార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత వివరాలను వివరించారు. డిసెంబర్‌తో పోలిస్తే 14,327టన్నుల బొగ్గు ఉత్పత్తి అధికంగా సాధించామన్నారు. అధికారులు, కార్మికులు సమష్టిగా కృషిచేసి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని కోరారు.

Similar News

News February 2, 2025

HYD: నేడు కాంగ్రెస్ నిరసనలు

image

కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్షకు నిరసనగా నేడు ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ పార్టీ భారీ ధర్నాను నిర్వహించనుంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. బడ్జెట్లో తెలంగాణ పట్ల చూపిన వివక్షను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

News February 2, 2025

చనిపోయే ముందు తణుకు ఎస్ఐ చాటింగ్..?

image

తణుకు ఎస్‌ఐ మూర్తి ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడలేదు. రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలోని బాత్రూం వద్ద ఆయన గన్‌తో కాల్చుకున్నారు. సూసైడ్ చేసుకునే ముందే ఆయన ఫోనులో ఎవరితోనో చాటింగ్ చేసినట్లు తెలుస్తోంది. సంబంధిత దృశ్యాలు స్టేషన్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఎస్ఐ ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఆ చాటింగ్ బయట పెడితేనే వాస్తవాలు వెల్లడవుతాయని బంధువులు అంటున్నారు.

News February 2, 2025

WNP: మధుమేహ పరీక్షల్లో వేగం పెంచాలి: DMHO

image

ముప్పై ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరికి ఉచిత మధుమేహ పరీక్షలు చేసే కార్యక్రమాన్ని మరింత వేగం పెంచాలని DMHO డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. శనివారం గోపాల్ పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య సిబ్బందికి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ కృష్ణకుమారి, డాక్టర్ చాంద్ పాషా, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సిద్ధ గౌడ్, మహేశ్వర చారి, సూపర్‌వైజర్లు, హెల్త్ అసిస్టెంట్స్ ఉన్నారు.