News March 26, 2025
మందమర్రి: కూతురితో తండ్రి అసభ్య ప్రవర్తన

కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తండ్రిపై పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు మందమర్రి SI రాజశేఖర్ తెలిపారు. యాపల్ ఏరియాకు చెందిన సతీశ్ తన 15 ఏళ్ల కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అడ్డుకోబోయిన భార్యను చేతులు, కర్రతో బాదాడు. దీంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు SI వెల్లడించారు.
Similar News
News April 1, 2025
అన్ని హామీలు అమలు చేస్తాం: మంత్రి పొన్నం

TG: ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను త్వరలోనే అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్‌లో సన్నబియ్యం పథకాన్ని ఆయన ప్రారంభించారు. రాజీవ్ యువ వికాసం పథకానికి నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కరవు వస్తుందని కొందరు మాట్లాడుతున్నారని, మానేరు ప్రాజెక్టులో గతేడాది కంటే ఇప్పుడే నీటి నిల్వలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అర్హులకు రేషన్ కార్డులు ఇస్తామని పేర్కొన్నారు.
News April 1, 2025
మారేడుమిల్లి: తమ్ముడు హత్య కేసులో అన్న అరెస్ట్

అల్లూరి జిల్లా మారేడుమిల్లి (M) నీలవరంలో రూ.20 వేలు బాకీ ఇవ్వనందుకు తమ్ముడు సుగ్గిరెడ్డిని బాణంతో హత్య చేసిన అన్న లచ్చిరెడ్డిని అరెస్ట్ చేశామని సీఐ గోపాలకృష్ణ మంగళవారం తెలిపారు. గత నెల 23న ఈ ఘటన జరగగా అప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉండగా నేడు అరెస్ట్ చేశామన్నారు. వ్యాన్ కొనుగోలు విషయంలో తమ్ముడు అన్నకు 20 ఏళ్ల క్రితం రూ.20వేలు బాకీ పడ్డాడని, అప్పటి నుంచి ఇరువురు మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిపారు.
News April 1, 2025
NLG: ఆన్‌లైన్‌లో పేరు ఉన్నా.. సన్న బియ్యం!

కొత్తగా రేషన్ కార్డులు మంజూరై పౌరసరఫరాల శాఖ పోర్టల్లో పేర్లు ఉన్న వారికి కూడా సన్న బియ్యం పంపిణీకి పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో నూతనంగా కార్డులు జారీ కాకున్నా పోర్టల్లో పేర్లు ఉన్న వారికి సైతం సన్న బియ్యం అందనున్నాయి. ఉగాది రోజున సీఎం రేవంత్ రెడ్డి హుజూర్నగర్లో ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోనూ ఆ మేరకు పంపిణీకి పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.