News March 12, 2025

మందమర్రి: కేకే 5 గనిలో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు

image

మందమర్రి ఏరియాలోని KK 5 గని మొదటి షిఫ్ట్ లో జరిగిన ప్రమాదంలో గోలెం సాయి శివ అనే కార్మికుడు గాయపడ్డాడు. 4 సీమ్ 26 దగ్గర దిగి ఉన్న టబ్ ఎక్కించే ప్రయత్నంలో టబ్ ఫ్రేమ్‌కు రైలుకి మద్య కార్మికుడి ఇరకడంతో కుడి చేయి మధ్య వేలు తెగి పోయింది. హుటాహుటిన కార్మికుడిని రామకృష్ణాపూర్‌లోని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 14, 2025

నిజామాబాద్‌లో రెండో విడత పోలింగ్ ప్రశాంతం

image

నిజామాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ
ప్రశాంతంగా ముగిసింది. డిచ్‌పల్లి మండలంలో స్వల్ప ఘర్షణ జరిగినప్పటికీ పోలీసులు దాన్ని సమర్థవంతంగా నివారించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎన్నికల పరిశీలకుడు శాంప్రసాద్ లాల్ ఎనిమిది మండలాల్లో తిరుగుతూ పోలింగ్ సరళిని పరిశీలించారు.

News December 14, 2025

ఏయూలో రేపటి నుంచి ‘సరస్’ డ్వాక్రా బజార్

image

విశాఖ ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో రేపటి (డిసెంబర్ 15) నుంచి 26వ తేదీ వరకు ‘సరస్’ (SARAS) అఖిల భారత డ్వాక్రా బజార్ జరగనుంది. గ్రామీణ మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించే ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా 600 మంది మహిళలు.. 250 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. చేనేత వస్త్రాలు, హస్తకళలు, ఆహార పదార్థాలు ఇక్కడ లభిస్తాయని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు.

News December 14, 2025

సంక్రాంతికి ఉత్తరాంధ్రకు ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కేదెప్పుడు?

image

ఉత్తరాంధ్ర నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు ఉపాధి కోసం అధిక సంఖ్యలో వలస వెళ్తుంటారు. వీరంతా సంక్రాంతికి తమ సొంతూరికి వెళ్లేందుకు సిద్ధం కాగా.. ఇప్పటికే అన్ని రైళ్ల టికెట్లు పూర్తిగా బుక్ అయ్యాయి. హైదరాబాద్ నుంచి ఉత్తరాంధ్రకు ఒక్క ప్రత్యేక రైలు కూడా ప్రకటించలేదు. పండగ రద్దీని దృష్టిలో పెట్టుకొని స్థానిక ప్రజా ప్రతినిధులు రైల్వే శాఖపై ఒత్తిడి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.