News March 11, 2025
మందమర్రి: యాక్సిడెంట్.. నేరస్థుడికి జైలు శిక్ష

యాక్సిడెంట్ కేసులో నేరస్థుడికి 18నెలల జైలు, రూ.8వేల జరిమానా విధిస్తూ మొదటి అదనపు జ్యుడీషియల్ జడ్జి విధించినట్లు SIరాజశేఖర్ తెలిపారు. SI కథనం ప్రకారం.. 2016లో మందమర్రి కానిస్టేబుల్ శ్రీధర్ బైక్‌పై వెళ్తున్నారు. వెనుక నుంచి అజాగ్రత్తగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. శ్రీధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసులో సాక్షులను విచారించిన జడ్జి నిందితుడు లారీ డ్రైవర్ సుధాకర్ రెడ్డికి జైలు శిక్ష విధించారు.
Similar News
News March 11, 2025
రేపు జూనియర్ అధ్యాపకులకు నియామక పత్రాలు

TG: ఎన్నికల కోడ్ ముగియడంతో ఎట్టకేలకు జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలు ఇవ్వనున్నారు. కొత్తగా ఎంపికైన 1,286 మంది JLలకు రేపు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ లెటర్లు అందజేయనున్నారు. గత నెలలోనే వారికి పోస్టింగ్‌లు కేటాయించారు. ఈ కార్యక్రమం ఎక్కడ నిర్వహిస్తారనేది ఇవాళ క్లారిటీ రానుంది.
News March 11, 2025
మూడు రోజుల్లో సర్వే పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలోని సచివాలయాలలో చేపడుతున్న వివిధ రకాల సర్వే ప్రక్రియ మూడు రోజులలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ.పి.అరుణ్ బాబు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి మండల అధికారులతో వివిధ అంశము లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన వివిధ రకాల సర్వేలలో ఎ.యన్.యంలు తప్ప మిగిలిన సచివాలయ సిబ్బందిని సర్వే ప్రక్రియలలో వినియోగించుకొని త్వరితగతిన పూర్తీ చేయాలన్నారు.
News March 11, 2025
పుట్టపర్తి: అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ

పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 218 అర్జీలు వచ్చినట్లు సోమవారం అధికారులు తెలిపారు. గ్రీవెన్స్‌కు వచ్చే అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా రెవెన్యూ, రీ సర్వే పనులకు సంబంధించి అర్జీలు ప్రజల నుంచి వస్తే ఎప్పటికప్పుడు పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమస్య పరిష్కారం ఎందుకు కాలేదో అర్జీదారులకు తెలపాలన్నారు.