News July 25, 2024

మక్తల్: ఏసీబీకి చిక్కిన సర్వేయర్

image

మక్తల్ తహశీల్దార్ కార్యాలయంలో సర్వేయర్‌గా పని చేస్తున్న బాలరాజు ఏసీబీకి చిక్కాడు. గురువారం ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. మక్తల్‌కు చెందిన శ్రవణ్ కుమార్ అనే వ్యక్తికి అనుకూలంగా సర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు లంచం అడిగాడు. దీంతో శ్రవణ్ కుమార్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. నేడు సర్వేయర్ రూ.9వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Similar News

News November 29, 2024

రేవంత్‌ ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా: హరీశ్ రావు

image

సిద్దిపేటలో నిర్వహించిన దీక్షా దివాస్‌లో సీఎం రేవంత్ పై హరీశ్ రావు మండిపడ్డారు. ‘రేవంత్‌ ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా, ఇచ్చిన తెలంగాణ ప్రకటనను కాంగ్రెస్‌ సర్కార్‌ వెనక్కి తీసుకున్నప్పుడు ఉద్యమం ఉవ్వెత్తున మొదలైంది. అప్పుడు ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని తెలంగాణ ప్రజలు డిమాండ్‌ చేస్తే రేవంత్ పారిపోయిండు. రేవంత్‌ మీద ఉద్యమ కేసులు లేవు కానీ.. ఓటుకు నోటు కేసు మాత్రం నమోదైంది’ అని హరీశ్ రావు అన్నారు.

News November 29, 2024

నాగర్ కర్నూల్: మధ్యాహ్న భోజనం తిని నలుగురు విద్యార్థుల అస్వస్థత

image

మరో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని గోరిట ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని శుక్రవారం నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. టమాటా రైస్, గుడ్డు తిన్న నలుగురు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు వైద్యులను పాఠశాలకు పిలిపించి అక్కడే చికిత్స అందించారు. ఈఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 29, 2024

బాలానగర్ సీతాఫలం భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేయండి: SKLTSHU

image

బాలానగర్ మండల సీతాఫలం భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేయాలని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఈ మండలంలో పుట్టిన సీతాఫలం ఇతర జిల్లాల్లో విస్తరించింది. ఈ చెట్టుకు అందమైన ఆకులు, గుండ్రని ఆకారంలో రుచికరమైన పండ్లు ఉంటాయి. ఈ సీతాఫలాలు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. బాలానగర్ సీతాఫలానికి భౌగోళిక గుర్తింపు వస్తే ఈ రకానికి చట్టబద్ధత రక్షణ కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.