News March 25, 2024

మగువ.. ఆత్మరక్షణ విద్యతో తెగువ

image

ప్రస్తుత సమాజంలో బాలికలకు చదువుతో పాటు ఆత్మరక్షణ విద్య అవశ్యం. శారీరక ఎదుగుదలతో పాటు మానసిక ఉల్లాసం సొంతమవుతుంది. తమను తాము రక్షించుకోవడం సహ ఒకానొక సందర్భంలో ఇతరులకు అండగా మారొచ్చు. దీనివల్ల వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. వేధింపులకు గురైతే నేరుగా ఎదుర్కోగలుగుతారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ ప్రభుత్వ విద్యా సంస్థల్లో కరాటే శిక్షణ నేర్పుతున్నారు.

Similar News

News April 18, 2025

న్యాయవాదుల అభిమానం మరువలేనిది: జిల్లా ప్రధాన న్యాయమూర్తి

image

మెదక్ జిల్లా న్యాయవాదుల అభిమానం మరువలేనిదని మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మి శారద అన్నారు. సూర్యాపేటకు బదిలీ అయిన సందర్భంగా మెదక్ కోర్టులో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సన్మానం ఏర్పాటు చేశారు. ఇక్కడ సేవలందించడం గొప్పవరం అన్నారు. ప్రతి న్యాయవాది పేద ప్రజలకు అండగా నిలబడాలన్నారు. మెదక్ జిల్లా న్యాయవాదుల అభిమానం వెలకట్టలేనిదని, ఇక్కడి ప్రజల అభిమానం మరువలేనిదని ఆమె పేర్కొన్నారు.

News April 18, 2025

మెదక్: ఈ నెల 21న అప్రెంటిషిప్ మేళా

image

ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళా పథకం ద్వారా మెదక్ పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 21న అప్రెంటిషిప్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొననున్నారని అన్నారు. మెదక్ జిల్లాలోని ఐటీఐ కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News April 18, 2025

మెదక్: పెళ్లికి అడ్డుగా ఉందని కూతురిని చంపిన తల్లి అరెస్ట్

image

రెండో పెళ్లికి అడ్డుగా ఉందని పాపను తల్లి నదిలో పారేసిన ఘటన కొల్చారంలో జరిగింది. వివరాలు.. చిలిపిచెడ్(M)కి చెందిన గాయత్రీకి కొల్చారం(M) వాసితో పెళ్లైంది. వీరికి 4 నెలల కూతురు ఉంది. వీరి మధ్య గొడవలు జరుగుతుండటంతో గాయత్రీ కుమార్తెతో అదృశ్యమైంది. గాయత్రీనే రెండో పెళ్లికి కూతురు అడ్డుగా ఉందని మంజీరాలో పాపను పారేసి హత్య చేసినట్లు తేలింది. గాయత్రీని, తండ్రి దీప్లా, అత్త బూలి ముగ్గురిని అరెస్ట్ చేశారు.

error: Content is protected !!