News February 21, 2025
మచిలీపట్నం: APK ఫైల్ క్లిక్ చేస్తే.. ఖాతా ఖాళీ.!

ఆన్లైన్‌లో అనుమానాస్పద APK ఫైళ్లను డౌన్‌లోడ్ చేసి ఓపెన్ చేస్తే బ్యాంక్ ఖాతాలు ఖాళీ కావొచ్చు అని ఎస్పీ ఆర్. గంగాధరరావు హెచ్చరించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అపరిచిత లింకులు, అనధికారిక యాప్‌ల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు.
Similar News
News February 22, 2025
పెనమలూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. పెనమలూరు పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. గంగూరు వద్ద శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి గాయాలతో పడి ఉన్నాడే. సమాచారం అందుకున్న పోలీసేులు అక్కడికి చేరుకొని విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో జాయిన్ చేశామన్నారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందినట్లు తెలిపారు. ఈ వ్యక్తి తెలిస్తే పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలన్నారు.
News February 22, 2025
పెడనలో బాలిక మిస్సింగ్.. పోలీసుల గాలింపు

తోటమూల ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ బాలిక అదృశ్యమైన ఘటన పెడన పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పెడన పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న ఎస్పీ ఆర్. గంగాధర్ పోలీసులను అలర్ట్ చేసి, పెడన సీఐ పర్యవేక్షణలో 4 పోలీసు బృందాలతో బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
News February 22, 2025
మచిలీపట్నం: జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం

వాహన చోదకులు హెల్మెట్, సీట్ బెల్టు ధరిస్తే చాలావరకు రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని కలెక్టర్ బాలాజీ అన్నారు. శుక్రవారం మచిలీపట్నం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది. రోడ్డు ప్రమాదాల స్థితిగతులు, డ్రంక్ అండ్ డ్రైవ్, హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్ కేసులు, రహదారులపై బ్లాక్ స్పాట్లకు తీసుకున్న చర్యలు, రహదారి భద్రత అవగాహన కార్యక్రమాలపై చర్చించారు.