News June 2, 2024
మచిలీపట్నం: కౌంటింగ్ హాల్లో గందరగోళం సృష్టిస్తే చర్యలు

ఈ నెల 4వ తేదీన కృష్ణా విశ్వవిద్యాలయంలో ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో ఎవరైనా సరే, గందరగోళం సృష్టిస్తే తక్షణమే బయటకు పంపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ అద్నాన్ నయీంతో కలిసి కలెక్టరేట్‌లో ఆర్ఓలు, డీఎస్పీలతో ఓట్ల లెక్కింపు, శాంతి భద్రతల పర్యవేక్షణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
Similar News
News April 25, 2025
తేలప్రోలు: కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

హౌరా-చెన్నై మధ్య నడిచే కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో కార్గో బోగి రైల్వే చక్రాలు దగ్గర మంటలు చెలరేగాయి. శుక్రవారం ఉదయం తేలప్రోలు దగ్గర మంటలు రావడంతో లోకో పైలట్ అప్రమత్తమై ట్రైన్‌ను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. తేలప్రోలు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. లోకో పైలట్ మంటలను ఆర్పి వేశారు.
News April 25, 2025
కృష్ణా: ఈ ప్రాంతాల ప్రజలు జాగ్రత్త.!

జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నట్లు APSDMA తెలిపింది. శుక్రవారం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే ప్రాంతాలను వెల్లడించింది. బాపులపాడు 40.8°, గన్నవరం 41.2°, గుడివాడ 40.2°, కంకిపాడు 40.7°, నందివాడ 40.1°, పెనమలూరు 40.9°, ఉంగుటూరు 40.9°, పెదపారుపూడి 40.3°, తోట్లవల్లూరు 40°, ఉయ్యూరు 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
News April 25, 2025
మోపిదేవి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

కృష్ణా జిల్లా మోపిదేవి వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. స్థానికుల కథనం మేరకు.. అవనిగడ్డకు చెందిన యాసాబాల భాస్కర్ (21), బంతుల సుధాకర్ (18) చల్లపల్లి వెళ్తుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.