News April 30, 2024

మచిలీపట్నం స్వతంత్ర అభ్యర్థికి ‘గాజు గ్లాసు’ను పోలిన గుర్తు

image

మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి చింతపల్లి మనోహర్‌కు గాజు గ్లాసును పోలిన గుర్తును కేటాయించారు. నామినేషన్ల ఉపసంహరణల అనంతరం మచిలీపట్నం అసెంబ్లీ బరిలో 14 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారని రిటర్నింగ్ అధికారిణి వాణి తెలిపారు. వీరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు వారి వారి పార్టీ సింబల్స్ కేటాయించామన్నారు. ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులకు కూడా సింబల్స్ కేటాయించామని చెప్పారు.

Similar News

News January 2, 2025

MTM : కానిస్టేబుల్ అభ్యర్థి మృతికి కారణాలివే.!

image

మచిలీపట్నంలో జరుగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల్లో ఎ.కొండూరుకు చెందిన దారావత్ <<15046039>>చంద్రశేఖర్ (25) మృతి చెందడం<<>>పై పోలీసులు వివరణ ఇచ్చారు. కార్డియాటిక్ అరెస్ట్‌తో మరణించినట్లు వైద్యులు వెల్లడించారన్నారు. ప్రాథమికంగా పరీక్షలు చేసిన రిపోర్టుల్లో అతనికి SEPSIS కారణంగా WBC కౌంట్ 30వేలకు చేరిందన్నారు. అతను గత 5 రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోందని వైద్యులు తెలిపారు.

News January 2, 2025

విజయవాడ: వైసీపీ నేతకు సుప్రీంలో ఊరట

image

వైసీపీ నేత, రాష్ట్ర ఫైబర్ నెట్ మాజీ ఛైర్మన్ గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ జరిగే వరకు గౌతమ్ రెడ్డిని అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది.

News January 2, 2025

నాకేం తెలియదు.. పోలీసుల విచారణలో జయసుధ

image

రేషన్ బియ్యం మాయం కేసుకు సంబంధించి పోలీసుల విచారణకు హాజరైన మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ గుట్టు విప్పలేదు. నిజం రాబట్టేందుకు పోలీసులు క్లిష్ట ప్రశ్నలు సంధించినా ఆమె నోరు విప్పలేదని తెలుస్తోంది. గోడౌన్ నిర్వహణ వ్యవహారాలన్నీ తమ మేనేజరే చూసుకునే వారని, తనకేమీ తెలియదని విచారణాధికారికి చెప్పినట్టు సమాచారం. జయసుధ నుంచి ఆశించిన సమాచారం రాకపోవడంతో ఆమెను మరోసారి విచారించే అవకాశం కనిపిస్తోంది.