News July 22, 2024
మడకశిర: లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన సోమవారం జరిగింది. స్థానికుల వివరాలు..మడకశిర మండలం బుల్లసముద్రం గ్రామం వద్ద వ్యక్తి రోడ్డు దాటుతుండుగా లారీ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతిచెందారు. ఆ లారీ ఆపకుండా వెళ్లినట్లు తెలిపారు. మృతుడు బుల్లసముద్రం గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మడకశిర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Similar News
News November 5, 2024
శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 104 హెల్త్ అంబులెన్స్ ఉద్యోగుల నిరసనలు
శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 104 హెల్త్ అంబులెన్స్ ఉద్యోగులు నిరసన ప్రదర్శించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, జీతాల పెంపు, మూడు నెలల జీతాల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లకు 104 సిబ్బంది వినతి పత్రాలు అందజేశారు. మూడు నెలలుగా తమకు వేతనాలు ఇవ్వడం లేదని, కుటుంబాలను పోషించడం కష్టమవుతోందని 104 అంబులెన్స్ ఉద్యోగులు పేర్కొన్నారు.
News November 5, 2024
పోలీసుల గౌరవం పెంచడానికి ప్రభుత్వం కృషి: హోం మంత్రి
రాష్ట్రంలో పోలీసుల గౌరవాన్ని పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో డీఎస్పీల పాసింగ్ అవుట్ కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నామన్నారు. పోలీసు వ్యవస్థపై గురుతర బాధ్యత ఉన్నదని, అందరూ సమర్థవంతంగా పని చేయాలని కోరారు.
News November 5, 2024
నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్
శ్రీ సత్యసాయి జిల్లాలో త్వరలో నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు నిర్వహించనున్నామని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలలో ఇరిగేషన్ అధికారులు ప్రతి ఉత్సాహం చూపకూడదని కలెక్టర్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా జల వనరుల శాఖ ఆధ్వర్యంలో సాగునీటి సంఘం ఎన్నికల మొదటి విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.