News February 13, 2025

మడకశిర సీఐ రామయ్య సస్పెండ్ 

image

మడకశిర అప్ గ్రేడ్ సీఐగా పని చేస్తున్న రాగిరి రామయ్యను సస్పెండ్ చేస్తూ గురువారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని జిల్లా ఎస్పీ రత్నకు ఇటీవల ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ఎస్పీ వెంటనే విచారణకు ఆదేశించి ఆయనను వీఆర్‌కి పంపారు. మహిళ ఆరోపణలపై విచారణ జరిపిన అనంతరం సీఐని నేడు సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News February 13, 2025

రేపు బంద్.. స్కూళ్లకు సెలవు ఉందా?

image

రేపు తెలంగాణ బంద్‌కు మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు పిలుపునిచ్చారు. దీంతో రేపు స్కూళ్లకు సెలవు ఉంటుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ బంద్‌కు మద్దతివ్వడంపై విద్యార్థి సంఘాలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి రేపు బంద్ తీవ్రతను బట్టి విద్యాసంస్థలు సెలవు ఇవ్వడంపై నిర్ణయం ప్రకటించనున్నాయి. మీ స్కూలుకు సెలవు ఇచ్చారా? కామెంట్ చేయండి.

News February 13, 2025

ఏలూరులో వందే భారత్‌కు అదనపు హాల్ట్ కొనసాగింపు

image

విశాఖ – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు (20707/08)కు ఏలూరు రైల్వే స్టేషన్‌లో అదనపు హాల్ట్ మరో ఆరు నెలలు కొనసాగుతుందని వాల్తేరు డివిజన్ డిసిఎం సందీప్ గురువారం తెలిపారు. ఏలూరు రైల్వే స్టేషన్‌లో ఒక నిమిషం పాటు రైలు ఆగనున్నట్లు తెలిపారు. ఈ హాల్ట్ ఇరువైపులా ఉంటుందన్నారు. ప్రయాణికుల విషయాన్ని గమనించాలన్నారు.

News February 13, 2025

అనకాపల్లి: తీర్థానికి వస్తుండగా యువకుడు మృతి

image

కె.కోటపాడు-మేడిచర్ల రోడ్డులోని డంపింగ్ యార్డ్ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మలుపు వద్ద బైకు అదుపుతప్పి చోడవరం(M) గవరవరం గ్రామానికి చెందిన అప్పికొండ కిరణ్ (21) మృతి చెందాడు. విశాఖలో ఉంటున్న కిరణ్ స్వగ్రామమైన గవరవరంలో గ్రామదేవత తీర్థానికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుని తండ్రి బాబురావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కే.కోటపాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!