News February 9, 2025
మణుగూరు: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739071530992_19535177-normal-WIFI.webp)
తొగ్గూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మణుగూరుకు చెందిన భూక్య కమలమ్మ(60) మరణించింది. స్థానికుల సమాచారం మేరకు.. మణుగూరు నుంచి అశ్వాపురం వెళ్తుండగా రోడ్డు దాటే క్రమంలో బుల్లెట్ బండి ఢీకొని తీవ్ర గాయాల పాలైనట్లు చెప్పారు. అనంతరం సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయని అన్నారు.
Similar News
News February 10, 2025
అల్లూరి జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739188995968_52219653-normal-WIFI.webp)
అల్లూరి జిల్లా మన్యంలో 11వ తేదీన జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మన్యంలో బంద్ జరుగుతున్నందున ఈ తేదీలు మార్చుతున్నట్లు చెప్పారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామన్నారు. బంద్ వలన ఈ మార్పు గుర్తించి తదుపరి తేదీ తెలుసుకొని పరీక్షకు రావలసిందిగా కలెక్టర్ ప్రకటించారు.
News February 10, 2025
పాలకుర్తి: శ్రీ సోమేశ్వర జాతర వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739191505999_19412650-normal-WIFI.webp)
మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 25 నుంచి మార్చి1 వరకు పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి జాతర నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జాతరకు సంబంధించి వాల్‌పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఆలయ అధికారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
News February 10, 2025
నిర్మలా సీతారామన్‌తో విశాఖ ఎంపీ భేటీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739185783233_20522720-normal-WIFI.webp)
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను విశాఖ ఎంపీ శ్రీభరత్ సోమవారం ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ ప్యాకేజీకి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. యూనియన్ బడ్జెట్‌లో 12 లక్షల వరకు వచ్చే జీతాలకు ఆదాయపు పన్ను ఉపశమనం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆదాయపు పన్ను కుదించడంతో మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలుగుతుందన్నారు.