News April 16, 2025

మదనపల్లె: ఉచ్చులో చిక్కుకున్న చిరుత పులి

image

అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం పొన్నూటి పాలెం వద్ద రైతులు వన్య ప్రాణుల నుంచి పంట రక్షణకు పొలాల చుట్టూ అమర్చిన ఉచ్చులో మంగళవారం రాత్రి ఓ చిరుత పులి చిక్కుకుంది. ఉదయాన్నే గమనించిన రైతులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి సమీపంలోకి చిరుత రావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు భయాందోళన చెందుతున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News December 20, 2025

ఈ నెల 24న కొడంగల్‌కు సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 24 తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల కొత్తగా ఎన్నికైన సర్పంచులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. వారిలో ముఖాముఖితో పాటు గ్రామాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. సీఎం పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు.

News December 20, 2025

క్రిస్మస్, న్యూ ఇయర్.. కర్నూలు ఎస్పీ హెచ్చరిక

image

క్రిస్మస్, న్యూ ఇయర్ గిఫ్ట్ పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని SP విక్రాంత్ పాటిల్ ప్రజలను హెచ్చరించారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా వచ్చే గిఫ్ట్ కార్డు లింకులతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దన్నారు. మోసానికి గురైతే 1930, 100, 102కు కాల్ చేయాలన్నారు.

News December 20, 2025

చిన్నారులకు HIV సోకిన రక్తం.. బాధ్యులకు ఏ శిక్ష విధించాలి?

image

MPలోని సాత్నా ప్రభుత్వాసుపత్రిలో తలసేమియా చిన్నారులకు రక్తమార్పిడి వేళ HIV సోకిన రక్తాన్ని ఎక్కించారు. రక్త సేకరణలో అజాగ్రత్తే దీనికి కారణం కాగా, బాధ్యులైన బ్లడ్ బ్యాంక్ ఇన్‌ఛార్జ్, ల్యాబ్ టెక్నీషియన్లు సస్పెండ్ అయ్యారు. అయితే చిన్నారుల బంగారు భవితను నాశనం చేసిన వీరికి ఏ శిక్ష విధిస్తే సరిపోతుంది? తమ పిల్లల్లైతే ఇలాగే చేస్తారా? తల్లిదండ్రులకు ఏం చెప్పి ఓదార్చగలం? అని నెటిజన్లు ఫైరవుతున్నారు.