News March 4, 2025
మదనపల్లె: ఉద్యోగం పేరుతో మోసపోయిన అమ్మాయిలు

ఉద్యోగం పేరుతో ముగ్గురు అమ్మాయిలు మోసపోయిన ఘటన మదనపల్లెలో జరిగింది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి(M)కి చెందిన ముగ్గురు అమ్మాయిలు డిగ్రీ చదివారు. వారికి మదనపల్లెలోని ఓ ప్రైవేట్ కంపెనీ జాబ్ ఆఫర్ చేసింది. రూ.18వేలు జీతం అని మాయమాటలు చెప్పారు. ఉద్యోగంలో చేరాలంటే రూ.45వేలు కట్టాలనడంతో నిర్వాహకులకు డబ్బులు చెల్లించారు. తీరా వారు జాబ్‌లో చేరిన తరువాత మోసపోయామని గ్రహించడంతో పోలీసులను ఆశ్రయించారు.
Similar News
News March 5, 2025
సంగారెడ్డి: వేసవి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి: కలెక్టర్

వేసవిలో మంచినీటి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవిలో మంచినీటి సమస్య లేకుండా చూడాలని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లను వెంటనే ప్రారంభించి చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, అధికారులు పాల్గొన్నారు.
News March 5, 2025
OUలో వివిధ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య కేంద్రమైన ప్రొఫెసర్ జి.రామ్‌రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా అందించే వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంబీఏ రెగ్యులర్ పరీక్ష ఫలితాలతో పాటు డిగ్రీ కోర్సుల సప్లమెంటరీ రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు.
News March 5, 2025
సిద్దిపేట: 8న జాతీయ లోక్ అదాలత్: సీపీ

ఈ నెల 8న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ సూచించారు. రాజీమార్గం రాజమార్గమని, సమయాన్ని డబ్బులను ఆదా చేసుకోవాలన్నారు. కక్ష కారుణ్యాలతో ఏమీ సాధించలేమని, రాజీ పడితే ఇద్దరూ గెలిచినట్లే చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందన్నారు.