News April 8, 2025
మదనపల్లె: కానిస్టేబుల్ జయప్రకాష్ దుర్మరణం

మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ పనిచేస్తున్న కానిస్టేబుల్ జయప్రకాశ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. శనివారం తన కొడుకుకి ఆరోగ్యం బాగాలేక చికిత్స కోసం బెంగుళూరు వెళ్లాడు. సిటీలో హాస్పిటల్‌కు వెళ్తుండగా బుల్లెట్ బైక్ ఢీకొని తలకు బలమైన గాయలయ్యాయి. అక్కడ చికిత్స చేయించి, తిరుపతి నారాయణద్రి హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ సోమవారం ఆయన మృతిచెందాడు.
Similar News
News April 8, 2025
VKB: భార్యను పంపకపోవడంతో మామను హత్య చేసిన అల్లుడు

దోమ మండలంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పుట్టింటికి వెళ్లిన భార్యను పంపకపోవడంతో మామపై కక్ష పెంచుకుని హత్య చేసినట్లు నిందితుడు ఎడ్ల మల్లేశ్ అంగీకరించాడని పరిగి సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం రాత్రి నిద్రిస్తున్న మొగులయ్యను అల్లుడు మోత్కూర్ వాసి మల్లేష్ హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. భార్యాభర్తల విషయంలో మామ అడ్డు వస్తున్నాడని కక్షతో గొడ్డలితో నరికి చంపినట్లు వివరించారు.
News April 8, 2025
కేయూ: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

కాకతీయ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 258 పోస్టులకు గానూ 77 మంది మాత్రమే పని చేస్తున్నారు.ఇంకా 181 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.
News April 8, 2025
అగ్నిప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడికి గాయాలు

AP: సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో Dy.CM పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చిక్కుకున్నాడు. స్కూలులో జరిగిన ఈ ప్రమాదంలో చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలిసి పవన్‌ను వెంటనే సింగపూర్ వెళ్లాలని అధికారులు సూచించారు. అయితే కురిడి గ్రామానికి వస్తానని మాటిచ్చానని, ఆ తర్వాతే సింగపూర్ వెళ్తానని పవన్ బదులిచ్చారు.