News February 24, 2025
మద్దూరు: అదృశ్యమై.. శవమై కనిపించాడు

మద్దూరు మండలంలో ఓ గుర్తు <<15554760>>తెలియని <<>>వ్యక్తి ఉరేసుకుని మృతిచెందిన విషయం తెలిసిందే. ఎస్ఐ విజయ్‌కుమార్ వివరాలు.. రెనివట్ట గ్రామానికి చెందిన రాములు(50) గత నెల 20న ఇంటి నుంచి వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో ఆయన భార్య 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఆదివారం ఆయన చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాములుగా గుర్తించారు.
Similar News
News February 24, 2025
మహబూబ్‌నగర్ కలెక్టర్ కీలక సూచన

MBNR జిల్లా వ్యాప్తంగా ఆర్థిక వారోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ప్రజల్లో ఆర్థిక అవగాహన కల్పించేందుకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. రుణాలను ప్రభుత్వ సంస్థల ద్వారానే తీసుకోవాలని, ప్రవేట్ సంస్థల్లో తీసుకొని అధిక వడ్డీ బారిన పడకుండా జాగ్రత్త పడాలని కలెక్టర్ సూచించారు.
News February 24, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలపై విశాఖ కలెక్టర్ కసరత్తు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ సోమవారం పూర్తయ్యింది. విశాఖ జిల్లాలోని 13 పోలింగ్ కేంద్రాలకు గాను పీవో, ఏపీవో, ఓపీవోలను కేటాయిస్తూ కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు. కలెక్టరేట్లోని ఎన్.ఐ.సి. కేంద్రం నుంచి ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా 13 పీవోలను, 13 ఏపీవోలను, 26 మంది ఓపీవోలను కేటాయించారు.
News February 24, 2025
అనకాపల్లి జిల్లాలో రెండు రోజులు వైన్స్ బంద్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భాన్ని పురస్కరించుకుని ఈనెల 25వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అనకాపల్లి జిల్లాలో మద్యం షాపులను మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారి సుధీర్ తెలిపారు. సోమవారం ఆయన అనకాపల్లిలో మాట్లాడుతూ.. వచ్చేనెల మూడవ తేదీన(మార్చి 3) ఓట్ల లెక్కింపు సందర్భంగా మద్యం షాపులను మూసివేస్తామన్నారు.