News February 23, 2025
మద్దూరు: మహిళ అదృశ్యం.. కేసు నమోదు

మద్దూరు మండల పరిధిలో ఓ యువతి కనిపించకుండాపోయిన ఘటన ఈనెల 20న జరిగింది. పోలీసుల వివరాలిలా.. పల్లిగుండ్ల తండాకు చెందిన చిట్టిబాయ్ తన భర్త రవినాయక్‌తో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భర్తతో పాటు బంధువులు అన్ని ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. చిట్టిబాయ్ తండ్రి లక్ష్మణ్ నాయక్ శనివారం మద్దూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసునమోదైనట్లు ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపారు.
Similar News
News February 23, 2025
వరుసగా 2 ఓవర్లలో 2 వికెట్లు

ఛాంపియన్స్ ట్రోఫీ: పాకిస్థాన్‌తో మ్యాచులో భారత్ మళ్లీ రేసులోకి వచ్చింది. ప్రమాదకరంగా మారిన రిజ్వాన్, షకీల్‌లను మనోళ్లు వెనక్కి పంపారు. వారిద్దరూ కలిసి 100కు పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. అక్షర్, హార్దిక్ వేసిన వరుస ఓవర్లలో ఔటయ్యారు. 2 క్యాచులు మిస్ అయినా పాకిస్థాన్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. ప్రస్తుతం పాక్ స్కోర్ 35 ఓవర్లలో 160/4గా ఉంది.
News February 23, 2025
సిద్దిపేట: తెల్లారితే పెళ్లి.. గుండెపోటుతో తండ్రి మృతి

అంతా హడావుడి.. తెల్లారితే ఆ ఇంట్లో పెండ్లి ఉండగా ఇంతలోనే తీవ్ర విషాదం నెలకొంది. ఆనందం పట్ట లేకనో ఏమో తెలియదు కానీ ఆ ఇంటికి పెద్ద దిక్కు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన దుబ్బాక మండలం రామక్కపేటలో జరిగింది. గ్రామానికి చెందిన రాగుల సత్యనారాయణ గౌడ్ సిద్దిపేటలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం ఉదయం కొడుకు శ్రీనివాస్ వివాహం దుబ్బాకలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఉండగా.. శనివారం ఆయన గుండెపోటుతో మృతి చెందారు.
News February 23, 2025
6,463 మంది పరీక్షలు రాశారు: అనంత కలెక్టర్

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 సెంటర్లలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 మొదటి పేపర్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మొత్తం 7,293 మంది పరీక్ష రాయాల్సి ఉండగా.. అందులో 6,463 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని, 830 మంది అభ్యర్థులు హాజరు కాలేదని పేర్కొన్నారు. 88.61% ప్రజెంట్ పోల్ అయినట్లు ఆయన తెలిపారు.