News November 6, 2024

మద్దెలచెరువు సూరి హత్య కేసు నిందితుడికి బెయిల్

image

అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన మద్దెలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌కు బెయిల్ మంజూరైంది. సీఐడీ ఆర్మ్స్ యాక్ట్ కేసులో హైదరాబాద్ సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే సూరి హత్య కేసులో గతంలో జీవిత ఖైదు శిక్ష పడటంతో అతడు జైలులోనే ఉండనున్నాడు. 2011 జనవరి 4న భాను కిరణ్ చేతిలో సూరి హత్యకు గురైన విషయం తెలిసిందే. భాను కిరణ్ 12 ఏళ్లుగా చంచల్‌గూడ జైలులో ఉంటున్నాడు.

Similar News

News January 13, 2025

BREAKING: తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి

image

తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి నియమితులయ్యారు. ఏపీ ప్రభుత్వం ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి నియమితులయ్యారు. రోహిత్ 2022 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి.

News January 13, 2025

అనంతపురానికి CM అన్యాయం చేస్తున్నారు: తోపుదుర్తి

image

కుప్పం ప్రజలకు నీరు ఇవ్వడానికి CM చంద్రబాబు అనంతపురం జిల్లా ప్రజల కడపుకొడుతున్నారని రాప్తాడు మాజీ MLA తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. ‘కుప్పానికి నీళ్లు తరలించడానికి అనంతపురం జిల్లా పరిధిలో హంద్రీనీవా కాలువలో లైనింగ్ పనులు చేస్తున్నారు. దీంతో జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. 5లక్షల ఎకరాలకు నీరు అందదు. CMకు రాజకీయం తప్ప అనంతపురం ప్రజల ప్రయోజనాలు పట్టడం లేదు’ అని తోపుదుర్తి అన్నారు.

News January 13, 2025

శ్రీ సత్యసాయి: 1,668 మందికి ఉద్యోగాలు

image

ధర్మవరంలో గురువారం జరిగిన జాబ్ మేళాలో ఎంపికైన వారికి మంత్రి సత్యకుమార్ యాదవ్ నియామక పత్రాలు అందజేశారు. 5,120 మంది జాబ్ మేళాకు హాజరు కాగా, 99 కంపెనీల ప్రతినిధులు 1,668 మందిని ఎంపిక చేశారు. వచ్చిన అవకాశాన్ని యువతీ, యువకులు సద్వినియోగం చేసుకుని, లక్ష్యాన్ని అధిగమించాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ జిల్లా అధికారి హరికృష్ణ పాల్గొన్నారు.