News August 2, 2024
మద్య మానేరులో 10.55 టీఎంసీలకు చేరుకున్న నీటి నిల్వ
సిరిసిల్ల జిల్లా బోయినపల్లి, మండలం మన్వాడ వద్ద గల మధ్యమానేరులో నీటి నిల్వ 10.55 టీఎంసీలకు చేరిందని ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు. శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి ఎల్లంపల్లి జలాలు 14,814 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందన్నారు. జలాశయం పూర్తి సామర్థ్యం 318 మీటర్లు కాగా.. ప్రస్తుతం 309.45 మీటర్లు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 27.50 టీఎంసీలకుగాను 10:15 టీఎంసీలమేరకు నీరు ఉందని అధికారులు తెలిపారు.
Similar News
News November 27, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.2,32,941 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,09,814 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.81,660, అన్నదానం రూ.41,467 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
News November 27, 2024
రాజన్న స్వామివారి హుండీ ఆదాయం వివరాలు ఇవే
వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి 32 రోజుల హుండీ ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి. రూ.1,50,24,507 వచ్చినట్లు ఈవో వినోద్ రెడ్డి బుధవారం పేర్కొన్నారు. బంగారం 170 గ్రాములు రాగావెండి 9 కిలోల 800 గ్రాములు వచ్చినట్లు చెప్పారు. హుండీ లెక్కింపులో ఈవో వినోద్ రెడ్డి, ఏసీ కార్యాలయ పరిశీలకులు సత్యనారాయణ, ఆలయ సిబ్బంది, శ్రీరాజరాజేశ్వర సేవాసమితి వారు పాల్గొన్నారు.
News November 27, 2024
ఎంఈవోలు రోజుకో పాఠశాల సందర్శించాలి: కలెక్టర్ పమేలా
తమ మండలంలోని రోజుకో పాఠశాల సందర్శిస్తూ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఎంఈఓలకు సూచించారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లాలోని అన్ని మండలాల ఎంఈవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. సరుకుల నిల్వ గది, రికార్డులు పరిశీలించి నాణ్యత పాటించేలా చూడాలన్నారు.