News March 21, 2024

మద్యం గోడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం మద్యం గోడౌన్, తయారీ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ తనిఖీ చేశారు. బుధవారం నెల్లూరు రూరల్ మండల పరిధిలోని దేవరపాలెం వద్ద గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్యం గోడౌన్ ను కలెక్టర్ తనిఖీ చేశారు.

Similar News

News April 20, 2025

రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్: మంత్రి నారాయణ

image

నెల్లూరు నగరంలో ప్రతి ఇంటికి రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్‌ను అందిస్తామని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. శనివారం సాయంత్రం నెల్లూరు నగరంలో 48వ డివిజన్‌లో సురక్షిత తాగునీటి పథకంలో భాగంగా  డిస్పెన్సింగ్ యూనిట్‌ను ప్రారంభించారు. పేద ప్రజల కోసం 2018లోని ఎన్టీఆర్ సుజల స్రవంతికి శ్రీకారం చుట్టామన్నారు.

News April 19, 2025

SP కార్యాలయంలో ఈ-వ్యర్థాల ప్రదర్శన

image

నెల్లూరులోని ఎస్పీ కార్యాలయంలో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో ఈ-వేస్ట్ సేకరించి ప్రదర్శనకు ఉంచారు. పోలీస్ కార్యాలయంలో 57 మానిటర్లు, 69 హార్డ్ డిస్క్‌లు, సీపీయూలు, 26 కీ బోర్డులు, ప్రింటర్లు. 9 స్టెబిలైజర్లు, 25 కాట్రెడ్జిలు ఈ-వేస్ట్‌గా గుర్తించి వాటిని ప్రదర్శనకు ఉంచారు. అనంతరం కార్యాలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచారు.

News April 18, 2025

నెల్లూరు కార్పొరేషన్ ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా నందన్

image

నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజ బదిలీ అయిన విషయం తెలిసిందే. నూతన కమిషనర్‌గా ఇంకా ఎవరిని నియమించలేదు. ఈ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్ అదనపు కమిషనర్ నందన్‌ను ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

error: Content is protected !!